Monday, April 29, 2024

Tributes – జైపాల్ రెడ్డి జ‌యంతి…స్ఫూర్తి స్థ‌ల్ లో నేత‌ల ఘ‌న నివాళి..

హైద‌రాబాద్ – దివంగత నేత జైపాల్ రెడ్డి జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్‌లోని స్ఫూర్తి స్థల్‌లో పలువురు నేతలు నివాళులు అర్పించారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి , జూపల్లి కృష్ణారావు , పలువురు కాంగ్రెస్ నేతలు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ మలిదశ ఉద్యమంలో జైపాల్ రెడ్డి ఎంతో కృషి చేశారన్నారు. తెలంగాణ రావడంలో జైపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారన్నారు. ఆయన ఆకాక్షించిన తెలంగాణను నిర్మిస్తామని చెప్పుకొచ్చారు. జైపాల్ రెడ్డి పేరు మీద కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేస్తామన్నారు. తెలంగాణ చరిత్రలో ఆయన పేరు నిలిచిపోతుందన్నారు. హైదరాబాద్ నగరానికి మెట్రో ట్రైన్ వచ్చిందంటే జైపాల్ రెడ్డి కృషి ఫలితమే అని పేర్కొన్నారు.

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. జైపాల్ రెడ్డి ఉత్తమ లోక్‌సభ సభ్యుడిగా పేరుపొందారన్నారు. ఆయన లేక పోవడం తెలంగాణ రాష్ట్రానికే కాదు.. యావత్ దేశానికి లోటన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కృషి చేసి పార్లమెంట్‌లో బిల్లును పాస్ ఘనత ఆయనది అని అన్నారు.

మాజీ మంత్రి చిన్నారెడ్డి మాట్లాడుతూ.. జైపాల్ రెడ్డి స్టూడెంట్ లీడర్ నుంచి అంచలంచలుగా ఎదిగారన్నారు. జనతా పార్టీలో జైపాల్ రెడ్డి కొనసాగించినప్పుడు ఇక్కడ ఆయన చెదురని ముద్ర వేసుకున్నారన్నారు. తెలంగాణ బిల్లు పాస్ కావడానికి పార్లమెంట్‌లో జైపాల్ రెడ్డి చేసిన కృషి యావత్ తెలంగాణ ప్రజలు మరువరన్నారు. కాంగ్రెస్ పెద్దలను ఒప్పించి మెప్పించి బిల్లు పాస్ చేయించారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement