Saturday, May 4, 2024

Congress Complaint – అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నారు… అడ్డుకోండిః కెసిఆర్ ప్ర‌భుత్వంపై ఈసికి కాంగ్రెస్ ఫిర్యాదు

హైద‌రాబాద్ – ధరణి పోర్టల్‌లో అసైన్డ్ భూములను బీఆర్ఎస్ నేతలు తమ బినామీల పేర్ల మీదకు బదలాయింపు చేస్తోందని, అలాగే కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేస్తోందని అందువల్ల కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకు ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లింపులు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేత‌లు …టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మధుయాష్కీ గౌడ్ తదితరులతో కూడిన కాంగ్రెస్ ప్ర‌తినిధుల బృందం నేడు చీఫ్ ఎన్నిక‌ల అధికారి వికాస్ రాజ్ ను క‌లిసింది.. రైతుబంధు కోసం సమకూర్చిన నిధులు బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కదారి మళ్లిస్తోందని ఈ నేత‌లు ఫిర్యాదు చేశారు. కొత్త ప్ర‌భుత్వం ఏర్ప‌డే వ‌ర‌కూ కెసిఆర్ ప్ర‌భుత్వం ఎటువంటి విధాన ప‌ర‌మైన నిర్ణ‌యాలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాల‌ని కోరుతూ ఒక లేఖ‌ను ఈసీకి అంద‌జేశారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement