Thursday, May 2, 2024

Aditya L1 Mission: సౌర గాలులను పరిశీలిస్తున్న ఆదిత్య ఎల్‌1 మిషన్

సూర్యుడి అధ్యయనం కోసం ప్రయోగించిన ఆదిత్య ఎల్-1 మిషన్ విజయవంతంగా దూసుకుపోతుంది. అయితే, ఆ ఉపగ్రహంలో ఉన్న ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్ పరిమెంట్ పేలోడ్ సౌర గాలులను పరిశీలన చేయడం ప్రారంభించింది. ఆ స్టడీకి చెందిన రిపోర్టును భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ విడుదల చేసింది.

ప్రస్తుతం సోలార్ పేలోడ్ తన ఆపరేసన్స్ సక్రమంగా పని చేస్తున్నట్లు ఇస్రో వెల్లడించింది. విండ్ పార్టికల్ ఎక్స్ పరిమెంట్ లో రెండు పరికరాలు ఉన్నాయి.. దాంట్లో సోలార్ విండ్ ఐయాన్ స్పెక్ట్రోమీటర్ థర్మల్ అండ్ ఎనర్జిటిక్ పార్టికల్ స్పెక్ట్రోమీటర్ అనే రెండు పరికరాలను అమర్చినట్లు ఇస్రో తెలిపింది. సూప్రా థర్మల్ పరికరం సెప్టెబర్ 10వ తేదీ నుంచి యాక్షన్ లోకి వస్తుందని చెప్పింది. ఇక ఐయాన్ స్పెక్ట్రోమీటర్ ఇవాళ తన పనిని ప్రారంభించింది అని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రకటించింది. స్పెక్ట్రోమీటర్ పనితీరు బాగానే ఉందని ఇస్రో వెల్లడించింది. ఆదిత్య పేలోడ్ పరికరం తీసిన ఫోటోను ఇస్రో తన ట్విట్టర్ (ఎక్స్) అకౌంట్‌లో పోస్ట్ చేసింది

Advertisement

తాజా వార్తలు

Advertisement