Monday, May 6, 2024

Congress Campaign – దొరల రాజ్యాన్ని తరిమి కొడదాం…కదిలిరండి: రేవంత్ రెడ్డి

తెలంగాణాలో ఇందిరమ్మ రాజ్యాన్నే తీసుకు వస్తాం, దొరల రాజ్యం, దోపిడీ రాజ్యం తెస్తామా? ఇందిరమ్మ రాజ్యం అంటే పేదోళ్ల రాజ్యం, గరీబోళ్లను బాగు చేసే రాజ్యం తెస్తాం, బీఆర్ఎస్ను బొందల పెట్టే బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలు తీసుకుని పోలింగ్ బూత్ల దగ్గర పహారా కాసే సైనికుల పాత్ర పోషిస్తారు, అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్లో బుధవారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన విజయభేరీ కార్యక్రమంలో రేవంత్ రెడ్డీ మాట్లాడారు. ఆద్యంతం బీఆర్ఎస్ పార్టీని, సీఎం కేసీఆర్పై తీవ్ర పదజాలంతో విమర్శలు చేశారు.

ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, నిజామాబాద్లో గెలిచిన పార్టీ అధికారంలోకి వస్తుంది, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే తెలంగాణ కష్టాలు తీరుతాయన్నారు. 1963లో పండిట్ జవహర్లాల్ నెహ్రూ తెలంగాణాలో శ్రీరాంప్రాజెక్టును నిర్మింస్తే లక్షలాది ఎకరాల్లో పంటలు పండుతున్నాయని, నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరాం సాగర్ ప్రాజెక్టులను చూపించి మేము ఓట్లు అడుగుతాం,
లక్షా యాబై వేల కోట్లు ఖర్చు చేసి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును జనానికి చూపించి ఓట్లు అడగ గలవా? అని కేసీఆర్ను రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.


మేడి గడ్డ కుంగిపోయింది, అన్నారం పగిలిపోయింది, వీటిని చూపించగలవా? నిజంగా మొగాడివైతే, మూతి మీద మీశం ఉంటే బయటకు రా అని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఔను మాది ఇందిరమ్మ రాజ్యమే.. పేదోళ్లకు ఇళ్లు కట్టించాం. రైతుల రుణమాఫీ చేశాం, గిట్టుబాటు ధర చెల్లించాం, పోడు భూములకు పట్టాలు ఇచ్చాం, ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించాం, అందుకే మాది ఇందిరమ్మ రాజ్యమే. మాది దోపిడీల రాజ్యం కాదు, దొరల రాజ్యం కాదు, ఇసుక మాఫియా, భూ కజ్జాల మాఫియా, కమీషన్లు వసూలు చేస్తూ, ఆడబిడ్డల పుస్తెలు ఎత్తుకెళ్లే బీఆర్ఎస్ దొరల రాజ్యాన్ని తరిమి కొడదాం, అని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇందిరమ్మ రాజ్యంలో అన్ని మంచి పనులే.. పేదల సంక్షేమానికి కొదువ ఉండదని రేవంత్ రెడ్డి వివరించారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల సంక్షేమం కోసం అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న మహాలక్ష్మీ పథకాన్ని ప్రారంభిస్తామని, ఆడబిడ్డల ఖాతాల్లో రూ.2500లు జమ చేస్తామని, రైతు భరోసా పేరిట రైతులకు రూ.15వేలు ఇస్తామని, కౌలు రైతులకూ రైతు భరోసా అమలు చేస్తామని, పొలం లేని పేదలకు సంవత్సరానికి 12 వేలు ఇస్తామని, చదుకునే పిల్లలకు కంప్యూటర్లు, అవసరమైన వస్తువులు కొనుగోలుకు తల్లిదండ్రులపై ఆదారపడకుండా ప్రతి విద్యార్థికి రూ.5లక్షల బ్యాంకు గ్యారెంటీ ఇస్తామని, పేదల ప్రతి ఇంటికి ఉచిత కరెంటును సరఫరా చేస్తామని, వృద్ధులు, మహిళలు, వితంతువులు, ఒంటరి మహిళలకు రూ.4000ల పెన్షన్ ఇస్తామని రేవంత్ రెడ్డి తమ పార్టీ మ్యానిఫెస్టోలోని అంశాలను ప్రస్తావించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement