Tuesday, October 8, 2024

TS: బీజేపీని గెలిపించండి… మీ సమస్యలు తీర్చేందుకు మోడీ సిద్ధం.. ఈటెల

ఇల్లందు : చైతన్యానికి నాంది, పోరాటాల పురిటి గడ్డలో బీజేపీని గెలిపిస్తే ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు ప్రధాని మోడీ సిద్ధంగా ఉన్నారని బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ అన్నారు. ఈరోజు ఇల్లందులో బీజేపీ అభ్యర్థి రవీందర్ నాయక్ విజయం కాంక్షిస్తూ విజయ సంకల్ప సభను నిర్వహించారు.

ఈ సభలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి రాగానే రైతులు పండించే పంట క్వింటాల్ కు రూ.3,100 గిట్టుబాటు ధర కల్పిస్తామని, ఉజ్వల కలెక్షన్ ఉన్నవారికి సంవత్సరానికి నాలుగు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని, తెలంగాణ పరిశ్రమ రంగంలో ఈ ప్రాంత నిరుద్యోగులకు ప్రాధాన్యత కల్పిస్తామని అన్నారు. కేసీఆర్ మాట తప్పే మనిషిగా మిగిలిపోయాడని, మోడీ మాట నిలబెట్టుకునే మనిషిగా ఉండిపోయాడన్నారు. ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తానన్న కేసీఆర్ ఆమెని ఎందుకు విస్మరించారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీఅర్ఎస్ పార్టీలను ఘాటుగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో రంగా కిరణ్, నాళ్ళ సోమసుందర్, రామచంద్రనాయక్, సంజీవరెడ్డి, గోపి మాధవ్, మిర్యాల వెంకటేశ్వర్లు, ఎమ్మార్పీఎస్ జనసేన నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement