Wednesday, May 1, 2024

నేడు చేవెళ్ల‌లో కాంగ్రెస్ పార్టీ ఎస్టీ,ఎస్సీ డిక్ల‌రేష‌న్ స‌భ ..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: కాంగ్రెస్‌ పార్టీ దళిత, గిరిజన వర్గాలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయ త్నాలు మొదలు పెట్టింది. ఇప్పటికే రైతు, యూత్‌ డిక్లరేషన్లను విడుదల చేసిన కాంగ్రెస్‌ పార్టీ.. శనివారం చేవెళ్ల వేదికగా ఏఐసీసీ అధ్యక్షలు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లను ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. గత కాంగ్రెస్‌ ప్రభుత్వాల హయాం లో చేసిన పనులను గుర్తు చేస్తూనే.. మరో వైపు అధికా రంలోకి వస్తే దళిత, గిరిజన వర్గాలకు అభివృద్ధి, సంక్షే మానికి చేపట్టే పనులను వివరించనుంది. చేవెళ్లలో నిర్వహించే ప్రజాగర్జన సభను విజయవంతం చేసేందు కు పీసీసీతో పాటు కాంగ్రెస్‌ శ్రేణులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌లో పొందుపర్చే అంశాలపై సీఎల్పీ నేత భట్టి నేతృత్వంలో రాష్ట్రంలోని ఆయా వర్గాలకు చెందిన ముఖ్య నాయకులు ఇప్పటికే ఢిల్లికి వెళ్లి ఏఐసీసీ చీఫ్‌ మల్లిఖార్జున ఖర్గేతోనూ సమా వేశమై చర్చించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలు కాంగ్రెస్‌ పార్టీ వైపు మెజార్టీగా ఉండేవారని, ఇప్పుడు కొంత దూరమయ్యారని, వచ్చే ఎన్నికల్లో వారిని దరిచేర్చు కోవాలనే పట్టుదలతో ఉన్నారు. ఆ దిశగా డిక్లరేషన్లను రూపొందించినట్లుగా తెలిసింది.

ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లలో ప్రధాన అంశాలు..
కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాఆనే చేవెళ్ల సభా వేదికగా ప్రకటించే దళిత, గిరిజన డిక్లరేషన్లలో ఆయా వర్గాలకు మేలు చేసే విధంగా ఉన్నాయని తెలిసింది. వాటిలో కొన్ని ప్రధానమైన అంశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి.

  • ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేయాలని నిర్ణయం
  • దళిత బంధు తరహాలో ఎస్సీ, ఎస్టీలకు
    రూ. 12 లక్షల సాయం
  • ఇళ్ల నిర్మాణానికి కాంగ్రెస్‌ పార్టీ రూ. 5 లక్షలు ప్రకటిం చగా.. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రూ. 6 లక్షల సాయం చేయాలని నిర్ణయించినట్లుగా తెలిసింది.
  • కాంగ్రెస్‌ ప్రభుత్వాల హయాంలో దళితులకు కేటా యించిన 25 లక్షల అసైన్డ్‌ భూమలకు పట్టాలు ఇవ్వాలని, ఈ ప్రభుత్వం లాక్కున్న అసైన్డ్‌ భూములను తిరిగి తీసుకోవాలని నిర్ణయం
  • గిరిజనులకు సంబంధించిన 12 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు
  • ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ చట్టం అమలు
  • గిరిజనులకు నాలుగు ఐటీడీఏలు ఏర్పాటు
  • జనాభానిష్పత్తిప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు పెంపు
  • ఉన్నత చదువుల కోసం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఆర్థి క సాయం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
Advertisement

తాజా వార్తలు

Advertisement