Sunday, April 28, 2024

CM REVANTH REDDYత్వ‌ర‌లో ఉద్యోగాలు భ‌ర్తీ …

హైద‌రాబాద్ – ఇచ్చిన మాట ప్ర‌కారం జాబ్ క్యాలెండ‌ర్ ను విడుద‌ల చేస్తామ‌న్నారు రేవంత్ రెడ్డి.. ఆరు గ్యారంటీలు ద‌ర‌ఖాస్తు ప‌త్రాన్ని విడుద‌ల చేసిన అనంత‌రం రేవంత్ మాట్లాడుతూ, టీఎస్‌పీఎస్‌సీ ప్రక్షాళన పూర్తిగా ప్ర‌క్షాళ‌న చేస్తామ‌ని వెల్ల‌డించారు. ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్ తప్పకుండా ఉండాలని.. ప్రస్తుతం చైర్మన్ సహా బోర్డులోని కీలక సభ్యులంతా రాజీనామాలు సమర్పించారని చెప్పారు.

ఈ రాజీనామాలపై త్వరలోనే గవర్నర్ ఓ నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. ఆ తర్వాత వెంటనే గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు రిపీట్ కాకుండా పకడ్బంధీగా నియామకాలు చేపడుతామని హామీ ఇచ్చారు. అందరికీ న్యాయం చేస్తామని తమది ప్రజా ప్రభుత్వమని చెప్పారు. సాధ్య‌మంత త్వ‌ర‌గా నియామకాలు చేపడుతామని.. నిరుద్యోగులు ఎవరూ అధైర్య పడొద్దని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement