Thursday, May 2, 2024

TS: మహిళల భద్రత కోసం టీ-సేఫ్ యాప్ ను ప్రారంభించిన సీఎం రేవంత్

కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం మరో ముందడుగు వేసింది. ప్రయాణ సమయంలో మహిళల భద్రత కోసం టీ-సేఫ్ అనే యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ టీ-సేఫ్ ను తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు మంత్రులు సహా పలువురు పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. టీ-సేఫ్ యాప్ ద్వారా తెలంగాణ పోలీసులు మహిళల భద్రత కోసం ప్రయాణ పర్యవేక్షణ సేవలను అందజేయనున్నారు. టీ-సేఫ్ యాప్ అన్ని రకాల మొబైల్ ఫోన్లలో అందుబాటులో ఉండనుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement