Monday, May 6, 2024

TS: కేసీఆర్ కు బర్త్ డే విషెస్ తెలిపిన సీఎం రేవంత్..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఇవాళ ఓ ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇరిగేషన్‌ శ్వేత పత్రంపై అధికార-ప్రతిపక్షం నడుమ వాడీవేడిగా వాదనలు జరుగుతున్న టైంలో సీఎం రేవంత్‌ రెడ్డి తన సీటులోంచి లేచారు. మాజీ సీఎం కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.

కాంగ్రెస్ పార్టీ తరుపున కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఆయన పూర్తి ఆయురారోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు. అలాగే.. ప్రధాన ప్రతిపక్షనేతగా ఆయన ప్రభుత్వానికి సహకరిస్తూ తెలంగాణ పునర్ నిర్మాణంలో.. అభివృద్ధికి దోహదం చేయాలని కోరుకుంటున్నట్లు రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన పూర్తిగా ఆరోగ్యంతో ఉండాలని, ఆయన మరింత కాలం తెలంగాణ ప్రజలకు సేవలు అందించాలని తమ పార్టీ, ప్రభుత్వం కోరుకుంటున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement