Sunday, April 28, 2024

TS : మిష‌న్ భ‌గీర‌థ‌పై సీఎం ఫోక‌స్‌…నేడు ఉన్నత స్థాయి స‌మీక్ష‌…

మిషన్ భగీరథపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. ఈ క్రమం లోనే నేడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. సీఎంగా రేవంత్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. ఈ ప్రాజెక్టుపై మొదటిసారి సమీక్ష జరుపుతుండడం చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రాజెక్టుపై పలు ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే విజిలెన్స్ విచారణకు ఆదేశించింది.

వేసవి ప్రారంభం కావడంతో మంచినీటి సరఫరా, రిజర్వాయర్లు, పెండింగ్ బిల్లులు, పనులు తదితర అంశాలపై ఆయన సమీక్షించనున్నారని తెలుస్తోంది.గ్రామాల్లో నీటి సరఫరాపై ప్రభుత్వం ఇప్పటికే పంచాయతీ కార్యదర్శుల నుంచి సమాచారం సేకరిస్తోంది. గతంలో మిషన్ భగీరథ ప్రాజెక్టు నిర్వహణ గ్రామీణ నీటి సరఫరా శాఖ ఆధ్వర్యంలో ఉండగా ఇటీవల ప్రభుత్వం పంచాయతీలకు అప్పగించింది. ఈ మేరకు ప్రత్యేక అధికారులు, గ్రామ కార్యదర్శులకు మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సీఎం సమీక్ష ప్రాధాన్యత సంతరించుకుంది.

- Advertisement -

ప్రాజెక్టులో భారీ కుంభకోణం జరిగిందన్న ఆరోపణలతో ఇప్పటికే విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. తాజాగా వేసవి ఆరంభం కావడంతో మంచినీటి సరఫరా, రిజర్వాయర్లలో నీటి నిల్వలు..పెండింగు బిల్లులు, తదితర అంశాలపై రేవంత్ సమీక్షించనున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే గ్రామాల్లో నీటి సరఫరా తీరు పై పంచాయతీ కార్యదర్శుల నుంచి ప్రభుత్వం సమాచారాన్ని సేకరిస్తోంది. గతంలో మిషన్ భగీరథ ప్రాజెక్టు నిర్వహణ గ్రామీణ నీటి సరఫరాశాఖ ఆధ్వర్యంలో ఉండగా.. ఇటీవల ప్రభుత్వం ఆ బాధ్యతను పంచాయతీలకు అప్పగించింది. ప్రత్యేకాధికారులు, గ్రామ కార్యదర్శులకు దీనిపై మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో సీఎం సమీక్ష సర్వత్రా ప్రాధాన్యం సంతరించుకుంది. మిషన్ భగీరథలో ఎవరెవరికి కాంట్రాక్టులు అప్పగించారన్న దానిపై కాంగ్రెస్ సర్కారు ఆరా తీస్తోంది.

2016 ఆగస్టులో మిషన్​ భగీరథ పైలాన్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. డీపీఆర్​ ప్రకారం 43 వేల 791 కోట్లు రూపాయలు అంచనా వేశారు. ఇందులో ఇప్పటి వరకు అధికారికంగా 31 వేల కోట్ల రూపాయలు మేర ఖర్చు చేశారు. అయినా ఈ పథకానికి ఇంకా కొంత మొత్తం ఖర్చు చేయాల్సి ఉంది. లక్షా 50 వేల కిలో మీటర్ల పైప్‌ లైన్ వేసి.. 2.72 కోట్ల మంది ప్రజలకు మిషన్​ భగీరథ కింద మంచినీటి సౌకర్యం అందించామని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే కనెక్షన్లు ఇచ్చి కొన్ని చోట్ల నల్లాలు బిగించలేదన్న ఆరోపణలు ఉన్నాయి. మరికొన్ని చోట్ల ఇంకా మిషన్​ భగీరథ పనులు కొనసాగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

మిషన్​ భగీరథ పథకానికి తొలుత భారీ అంచనాలతో డీపీఆర్​ సిద్ధం చేశారు. తొలుత 45 వేల కోట్లు అంచనా వేయగా తరువాత దానిని సవరించి 43,791 కోట్లకు కుదించారు. ఖర్చు పెట్టింది మాత్రం 31 వేల కోట్లు మాత్రమే. ఇందులోనూ 77 శాతం అప్పులు ఉండగా, మిగిలిన 20 శాతమే గత ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇందులోనూ మూడు శాతం కేంద్రం గ్రాంట్ల రూపంలో నిధులు రాష్ట్రానికి వచ్చాయి. అయితే మిషన్ భగీరథకు ఖజానా నుంచి ఖర్చు చేసిన మొత్తం 6 వేల 122 కోట్లు రూపాయలుగా ఉంది. దీంతో అప్పులు, నిధులు ఏయే కాంట్రాక్టర్ కు కట్టబెట్టారనే దానిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆరా తీస్తోంది.

మిషన్​ భగీరథ మంచినీటి పథకానికి గత సర్కార్​ ఏకంగా 11 సంస్థల నుంచి అప్పులు తీసుకున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు ఇప్పటి వరకు మొత్తం 24 వేల 061 కోట్ల రూపాయలు మేర అప్పులు తీసుకున్నారు. హౌజింగ్​ అండ్​ అర్బన్​ డెవలప్​మెంట్​ కార్పొరేషన్​ నుంచి 4 వేల 235 కోట్లు రూపాయలు తీసుకోగా.. నాబార్డు నుంచి 3 వేల 660 కోట్లు రూపాయలు.. కార్పొరేషన్​ బ్యాంకు నుంచి 1665 కోట్లు రూపాయలు తీసుకున్నారు. పలు బ్యాంకుల నుంచి కూడా వేల కోట్ల రూపాయలు గత సర్కార్ అప్పులు చేసింది. మరోవైపు మిషన్ భగీరథ ప్రాజెక్టులో వేసిన పైపు లైన్లు నాసిరకంగా ఉండటంతో లీకేజీ సమస్యలు తలెత్తుతున్నాయి. అనేక గ్రామాల్లో మిషన్ భగీరథ నీళ్లు సరఫరా కావడం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement