Tuesday, February 20, 2024

Breaking | రేపు మెదక్​ జిల్లాలో సీఎం పర్యటన.. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి హరీశ్​రావు

ఉమ్మడి మెదక్​ (ప్రభ న్యూస్​ బ్యూరో): సీఎం కేసీఆర్ బుధవారం మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి హరీశ్ రావు సీఎం కేసీఆర్​ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. మెదక్‌ సమీకృత కలెక్టరేట్‌, పోలీసు సూపరింటెండెంట్‌ కార్యాలయం, బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని సందర్శించి పోలీసు, ఆర్ అండ్ బీ, ప్రజాప్రతినిధులు, అధికారులతో ​ సమీక్షించారు.

బహిరంగ సభ నిర్వహించే స్థలాన్ని పరిశీలించి, పెద్ద సంఖ్యలో తరలి వచ్చే ప్రజలు, పార్టీ శ్రేణుల కోసం ఏర్పాట్లు చేయాలన్నారు.  ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రితోపాటు స్థానిక ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర ప్రజాప్రతినిధులు, పలు విభాగాల అధికారులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement