Saturday, May 18, 2024

TS : ఈనెల 13నుంచి 28వ‌ర‌కు సీఎం రెండో విడ‌త ప్ర‌చారం

రెండవ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 13 నుండి 28వ తేదీ వరకు 16 రోజులపాటు కెసిఆర్ నియోజకవర్గాల్లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ నెల 5 నుండి 9 వ తేదీ వరకుమరో 12 నియోజకవర్గాల్లో సిఎం కెసిఆర్ నియోజకవర్గాల్లో పర్యటన చేపట్టనున్నారు. ఇందులో భాగంగా 54 నియోజకవర్గాల్లో జరిగే ప్ర జా ఆశీర్వాద సభల్లో బిఆర్‌ఎస్ అధినేత, సిఎం కెసిఆర్ పాల్గొంటారు. ఈనెల 28వ తేదీన గజ్వేల్ నియోజకవర్గంలో జరిగే ప్రజా ఆశీర్వాద సభతో అధినేత పర్యటన ముగియనుంది. దాంతోమొ త్తం 96నియోజకవర్గాల పర్యటన పూర్తికానున్నది.

నవంబర్ 13న దమ్మాపేట్,బుర్గంపాడ్, నర్సంపేట, నవంబర్ 14 పాలకుర్తి, హోలియా (నాగార్జునసాగర్), ఇబ్రహీంపట్నం, నవంబర్ 15న‌ బోధన్, నిజామాబాద్(అర్బన్), ఎల్లారెడ్డి, మెదక్, నవంబర్ 16న‌ అదిలాబాద్, బోథ్, నిజామాబాద్(రూరల్), నర్సాపూర్, నవంబర్ 17న‌ కరీంనగర్, చొప్పదండి, హుజురాబాద్, పరకాల్, నవంబర్ 18న చేర్యాల్(జనగాం), నవంబర్ 19న‌ అలంపూర్, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, నవంబర్ 20న మానకొండూర్, స్టేషన్ ఘన్‌పూర్, నకిరేకల్, నల్గొండ, నవంబర్ 21న‌ మధిర, వైరా, డోర్నకల్, సూర్యాపేట, నవంబర్ 22న‌ తాండూర్, కొడంగల్, మహబూబ్‌నగర్, పరిగి, నవంబర్ 23న మహేశ్వరం, వికారాబాద్, జహీరాబాద్, పటాన్‌చెరు, నవంబర్ 24న‌ మంచిర్యాల, రామగుండం, ములుగు, భూపాలపల్లి, నవంబర్ 25న‌ హైదరాబాద్‌లో బహిరంగ సభ, నవంబర్ 26న‌ ఖానాపూర్, జగిత్యాల, వేములవాడ, దుబ్బాక, నవంబర్ 27న‌ షాద్‌నగర్, చేవెళ్ల,అందోల్, సంగారెడ్డి, నవంబర్ 28న వరంగల్(ఈస్ట్, వెస్ట్), గజ్వేల్‌లో ప్ర‌చారం చేప‌ట్ట‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement