Sunday, May 5, 2024

Greetings | మంత్రి మల్లారెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్.. సోషల్​ మీడియాలో గ్రీటింగ్స్ హల్చల్​​​!

కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఇవ్వాల పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఆయనకు శుభాకాంక్షలు తెలియచేశారు. రాజకీయాల్లో, విద్యా సంస్థల పరంగా కూడా మల్లారెడ్డి అంటే అందరికీ చాలా క్రేజ్​ ఉంటుంది. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడుతారా.. ఏ సంచలనం విషయం బయటపెడుతారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.

అలాంటిది మంత్రి మల్లారెడ్డి పుట్టిన రోజు సందర్భంగా సోషల్​ మీడియాలో గ్రీటింగ్స్​తో హోరెత్తించారు. ఇక.. మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన కొన్ని మాటలను ఈ సందర్భంగా షేర్ చేసుకుంటూ సంబురపడుతున్నారు. అందులో చాలా ఫేమస్​ డైలాగ్​ అయిన.. ‘‘పాలమ్మిన, పూలమ్మినా’’ అనే మాటలను కోట్స్​ చేసుకుంటూ హ్యాపీగా షేర్​ చేసుకుంటున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement