Sunday, May 5, 2024

TS | రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కప్‌ క్రికెట్‌ పోటీలు.. త్వరలో విధివిధానాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కప్‌ క్రికెట్‌ పోటీలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పర్యాటక, క్రీడలు, ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌ అధికారులను ఆదేశించారు. సీఎంకప్‌ క్రీడల్లో లక్షలాది మంది గ్రామీణ క్రీడాకారులు పాల్గొన్నారనీ ఇదే స్ఫూర్తి తో సీఎం కప్‌ క్రికెట్‌ పోటీలు నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు. శుక్రవారం అసెంబ్లి సమావేశ మందిరంలో స్పోర్ట్స్‌, టూరిజం అభివృద్ధి పనులపై అధికారులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోచేపట్టిన పర్యాటక ప్రాజెక్టుల వేగం పెంచాలని చెప్పారు. ఆన్‌ గోయింగ్‌ ప్రాజెక్టుల పుల్లో వేగం పెంచాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 17,600గ్రామీణ క్రీడాప్రాంగణాలకు స్పోర్ట్స్‌ కిట్స్‌ పంపిణీ చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. అలాగే అసెంబ్లి నియోజకవర్గాల్లో నిర్మిస్తున్న క్రీడా మైదానాల పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు.

తెలంగాణ యువజన సర్వాసుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాబ్‌ మేళాలను మిగిలిన జిల్లాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అధికారులను అదేశించారు. సమీక్ష సమావేశంలో రాష్ట్ర యువజన సర్వాసుల శాఖ ముఖ్య కార్యదర్శి సవ్యసాచి ఘోష్‌, తెలంగాణ టూరిజం, క్రీడలు ముఖ్యకార్యదర్శి సైలజా రామయ్యర్‌, యువజన సర్వాసుల శాఖ డైరెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, క్రీడా ప్రాధికారిక సంస్థ డిప్యూటీ డైరెక్టర్‌ సుజాత, సెట్విన్‌ ఎండి వేణుగోపాల్‌ తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement