Sunday, April 28, 2024

కొండెక్కిన కోడి ధర.. కేజీ చికెన్ రూ.300!

నాన్ వెజ్ ప్రియులకు ఇది చేదు వార్తే. సండే వచ్చిందంటే చాలు చికెన్ తిందాం అని అనుకునే మాంసం ప్రియులకు చికెన్ ధరలు దడ పుట్టిస్తున్నాయి. తెలంగాణలో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. వీకెండ్ వస్తే నాన్ వెజ్ తినాలనుకునే వారికి చికెన్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. కరోనా సమయంలో ఒకానొక సందర్భంలో కిలో రూ.20, 30 కే చికెన్ ధరలు పడిపోయినప్పటికీ, తాజా మళ్లీ ధరలు పుంజుకున్నాయి. పైగా రాష్ట్రంలో బోనాల పండుగ కూడా ఉండటంతో చికెన్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అమ్మవార్లకు బోనం సమర్పించే భక్తులు వారి స్తోమతను బట్టి వీలైతే యాటలను లేదంటే నాటు కోళ్లను, ఫారమ్ కోళ్లను నైవేధ్యంగా ఇచ్చి వాటిని కోసుకుంటారు.

బోనాల సీజన్​గిరాకీ కారణంగా ధరలు కూడా ఒక్కసారిగా పెరిగిపోయాయి. చికెన్ ధర ఒక్క వారం రోజుల్లోనే 100 రూపాయలకు పైగా పెరిగింది. ప్రస్తుతం కేజీ చికెన్ ధర రూ. 250 ఉండగా, కొన్ని ప్రాంతాల్లో రూ.300లకు చేరుకుంది. ఇక, నాటు కోడి కిలో చికెన్ ధర రూ. రూ.700లకు చేరింది. ధరలను సామాన్యులు చికెన్ కొనాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement