Friday, May 3, 2024

Cherial Social Welfare Hostel – విద్యార్థులతో వంట‌ పని … అపరిశుభ్రంగా గురుకుల పాఠశాల ..

చేర్యాల: చేర్యాల పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆదివారం ఉదయం విద్యార్థులకు టిఫిన్ అందించే క్రమంలో వంటశాలలో విద్యార్థులతో చపాతీలు తయారు చేయించే ఘటన చోటుచేసుకుంది. ఆదివారం మాత్రమే కాకుండా ప్రతిరోజు కిచెన్ లో విద్యార్థులతోనే పనిచేస్తున్నట్లు, చేయకపోతే నానా బూతులు తిడుతూ బెదిరిస్తున్నట్లు విద్యార్థులు తెలిపారు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల వంటశాలలో దాదాపు 6 నుండి 8 మంది కార్మికులు పనిచేయాలి కానీ ముగ్గురు మాత్రమే పని చేస్తూ మిగతా పనిని మొత్తం విద్యార్థులతో చేస్తున్నారు.

43 బాత్రూములకు 10 మాత్రమే అందుబాటులో….
గురుకుల పాఠశాలలో 43 బాత్రూం లు ఉండగా అందులో పది మాత్రమే అందుబాటులో ఉన్నాయని మిగతా వాటికి తాళాలు వేయడంతో విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు వాపోయారు.

చెత్తాచెదారంగా కళాశాల పరిసరాలు….
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల పరిసరాలు పూర్తిగా నిండిపోయి ఉండి, కళాశాల చుట్టూ దట్టమైన గడ్డి మురిసినప్పటికీ దానిని తొలగించకుండా ప్రతిసారి విద్యార్థులతోనే పనిచేపిస్తున్నారని, వంటశాలలో వినియోగించిన వ్యర్థ పదార్థాలు మొత్తం వంటశాల పక్కనే వేయడంతో ఎప్పుడు కంపు కొడుతూనే ఉంటుందని విద్యార్థులు తెలిపారు. సమయానికి కూడా భోజనం అందించడం లేదని, నాశిరకంగా భోజనం అందిస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

కాంట్రాక్టర్ తో కుమ్మకైన ప్రిన్సిపల్…..
గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ కాంట్రాక్టర్ తో కుమ్మక్కై వంటశాలలో పనిచేయాల్సిన పని వాళ్ళని కాదని వారి స్థానంలో విద్యార్థులతో పని చేస్తూ కాంట్రాక్టర్ వద్ద నుండి డబ్బులు దండుకుంటూ పబ్బం గడుపుతున్నాడని విద్యార్థులు తల్లిదండ్రుల ఆరోపిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement