Saturday, March 2, 2024

TS: సీఎంలంటేనే గుర్తుకొచ్చేది చంద్రబాబు, వైఎస్ఆర్, కేసీఆర్ : కేటీఆర్‌

హైదరాబాద్: గడిచిన 25ఏళ్లలో సీఎంలు అంటేనే చంద్రబాబు, వైఎస్ఆర్, కేసీఆర్ లు గుర్తుకొస్తారని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లోని తాజ్‌ డెక్కన్‌లో నిర్వహించిన తెలంగాణ బిల్డర్స్‌ ఫెడరేషన్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు, వైఎస్ఆర్, కేసీఆర్ లు దీర్ఘకాలిక ముద్రవేశారన్నారు.ప్రొ బిజినెస్, ప్రొ ఐటీ, ప్రొ అర్బన్ ఇమేజ్ చంద్రబాబుదన్నారు.ప్రొ రూరల్, ప్రొ అగ్రికల్చర్ ప్రొ పూర్ అన్నది వైఎస్ఆర్ ఇమేజ్ అన్నారు. ప్రొ అర్బన్- రూరల్, ప్రొ ఐటీ- అగ్రికల్చర్ అనే ఇమేజ్ కేసీఆర్ దని అన్నారు.

కేసీఆర్ ది చాలా అరుదైన సమతుల్యమన్నారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. పెట్టుబడులు వస్తేనే కదా నగరంలో సంపద పెరుగుతోందన్నారు. ప్రాధాన్యతా క్రమంలో సమస్యలన్నీ పరిష్కరిస్తున్నామన్నారు. ఓఆర్‌ఆర్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ మధ్య సరికొత్త హైదరాబాద్‌ తయారవుతుందన్నారు. హైదరాబాద్‌కు రాకపోకలు చాలా సులువుగా జరగాలన్నారు. త్వరలో ప్రతిరోజూ తాగునీరు ఇచ్చేలా చూస్తామన్నారు. ఐటీ ఉద్యోగాల కల్పనలో రెండేళ్లుగా బెంగళూరును అధిగమించామన్నారు. అభివృద్ధి, ప్రగతి.. ఇలాగే కొనసాగాలని కేటీఆర్‌ ఆకాంక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement