Monday, April 29, 2024

8ఏళ్ల‌లో తెలంగాణ ప్ర‌భుత్వం చేసిన అప్పు రూ..2,07,881 కోట్లు

న్యూఢిల్లీ/ హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర అప్పులపై కేంద్రం పార్లమెంటులో ప్రకటన చేసింది. 2022 అక్టోబరు నాటికి తెలంగాణ మొత్తం అప్పులు రూ.4,33,817.6 కోట్లు అని కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. ప్రభుత్వ అప్పులే కాకుండా… రాష్ట్ర సర్కారు పరిధిలోని కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు చేసిన అప్పులను కూడా ఇందులో చేర్చారు. ఇక, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నాటికి ప్రభుత్వపరంగా రూ.75,577 కోట్ల అప్పులు ఉన్నట్టు కేంద్రం స్పష్టం చేసింది. 2021-22 నాటికి ఆ అప్పుల విలువ రూ.2,83,452 కోట్లు అని తెలిపింది. గత ఎనిమిదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం రూ.2,07,881 కోట్ల అప్పులు చేసినట్టు తెలిపింది. కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. అలాగే నాబార్డ్ నుండి రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ ఫండ్ కింద నాబార్డ్ నుండి తెలంగాణా ప్రభుత్వంకు ఇప్పటి వరకు 7144 కోట్ల రుణాలు అందాయని తెలిపింది. వేర్ హౌజింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద నాబార్డ్ నుండి ఇప్పటివరకు తెలంగాణా ప్రభుత్వం, కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు 85,227.94 కోట్ల రుణాలు తీసుకుందని పేర్కొంది కేంద్ర ఆర్థిక శాఖ.

a
Advertisement

తాజా వార్తలు

Advertisement