Friday, November 15, 2024

విద్యుత్ తీగలు తగిలి పశు గ్రాసం దగ్ధం.. త‌ప్పిన ముప్పు

కొత్తగూడ మండలంలోని పొగుళ్లపల్లి గ్రామ శివారులో పశుగ్రాసాన్ని తరలిస్తున్న వాహనానికి విద్యుత్ తీగలు తగిలి మంటలు చెలరేగిన సంఘటన చక్రాల తండాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్ళితే చక్రాల తండా నుండి ఇల్లందుకి డి.సి.ఎం. వాహనంలో పశుగ్రాసం నిమిత్తం తీసుకెళ్లేందుకు ఈరోజు ఉదయం చక్రాలతండా పరిసర ప్రాంతాలనుండి పెద్ద మొత్తంలో జమచేసి లోడ్ చేసుకుని కొత్తగూడ మీదుగా వెళ్ళడానికి బయలుదేరారు. లోడ్ తో వస్తున్న డి.సి.ఎం. వాహనానికి విద్యుత్ తీగలు తగలడంతో మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని గమనించిన డ్రైవర్ కంగారు పడకుండా చాకచక్యంతో వ్యవహరించాడు. వాహనాన్ని దూరంగా తీసుకెళ్లాడు. గడ్డి మంటల్లో పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు, వాహనానికి ఎలాంటి ఆపాయం జరగలేదు. మంటలను అర్పడానికి బాటసారులు, రైతులు సహాయంతో పెనుప్రమాదం తప్పించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement