Sunday, June 2, 2024

Actress Hema: విచార‌ణ‌కు రాలేను.. బెంగ‌ళూరు సీసీబీకి న‌టి హేమ లేఖ !

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. సీసీబీ విచారణకు నటి హేమ డుమ్మా కొట్టింది. తాను వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నానని విచారణకు రాలేనంటూ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు గడువు కోరుతూ లేఖ రాసింది. హేమ లేఖను పరిగణనలోకి తీసుకోని సీసీబీ.. హేమకు మరోసారి నోటీసులివ్వనున్నట్లు తెలుస్తోంది.

బెంగళూరు రేవ్‌ పార్టీలో మొత్తం 103 మంది పాల్గొనగా..వారిలో 86 మంది మాదకద్రవ్యాలను తీసుకున్నట్లు వైద్య పరీక్షల్లో గుర్తించారు. వారిలో టాలీవుడ్‌ కు చెందిన నటి హేమ కూడా ఉన్నారు. ఈరోజు ఆమెతో కలిసి మొత్తంగా ఎనిమిది మంది విచారణకు హాజరు కావాల్సి ఉండగా తాను రాలేనని హేమ లేఖలో పేర్కొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement