Monday, June 17, 2024

పరమాత్మ ఔదార్యానికి కొలమానమా?

‘అన్నీ నేనే చూసుకుంటున్నాను” అని అంటున్న మనం రక్షణ బాధ్యతను ఆయనకు వదిలేస్తున్నాము. మనము చేయలేని పనులు ఆయనను చేయమంటున్నాము. అసలు మనం చేయగల పనేదైనా ఉందా? మనకు కావలసినదాన్ని ఆయన దయ లేకుండా సాధించు కోగలమా? ఆయన దయ వలన పొందిన దానిని మనకు మనముగా రక్షించుకోగలమా? దానికీ మళ్ళీ ఆయన దయే కావాలి. ”యో బ్ర హ్మాణం విదధాతి పూర్వం యోవై వేదాంశ్చ ప్రహణోతి తస్మై’ అం టుంది వేదం. అనగా పరమాత్మ బ్రహ్మను సృ ష్టించి అతను సృష్టి చేయుటకు సాధనంగా అత నికి వేదములను ప్రసాదించాడు. ఈ వేదముల ను ముందు పెట్టుకొని జగత్సృష్టిని చేయమని చెప్పాడు. అంటే వేద ములలో సకల జగత్‌ సృష్టి విధా నము దాగివున్నదన్న మాట. ఈ నాటివారు ఏముంది వేదాలలో అంటున్నారు. అసలు అలా అన్న వారు వేదాలను అధ్యయనం చేశా రా? దాన్ని చదవకుండా దాన్ని చూడకుండా ఏముంది అందు లో? అంటున్నా స్వామి క్షమిస్తున్నారు. ఇది ఔదార్యం కాదా!
మనిషికి మనిషి రెండుహస్తముల దూరములో ఉండాలి. ఒకహస్తము అనగా మూడు అడుగులు 18 అంగుళములు ఒక హస్తము. రెండుహస్తములు 36 అంగుళములు అనగా మూడు అడుగులు అని కొందరి మతము. అనగా కనీసం మూడు అడుగుల దూరము లోనే ఉండాలి. భార్య అయినా, భర్త అయినా, తండ్రి అయినా, కొడు కులైనా, అన్నదమ్ములైన మాట్లాడుతున్నప్పుడు నోటికి చేతులు అడ్డు పెట్టుకొని మాట్లాడాలి. దేవాలయంలో కాని, ఇంట్లో కాని దేవునికి పూజ చేస్తున్నపుడు నోరు, ముక్కుకు అడ్డంగా తలకు ఒక వస్త్రం కట్టు కొనే ఆరాధన చేయాలి. ఆవలింత, దగ్గు, తుమ్ము వస్తే అంగవస్త్రం ఇప్పటి భాషలో కర్చీఫ్‌ అడ్డుపెట్టుకోవాలి. భోజనం కూర్చొనే చేయా లి. ఒకరికి ఇంకొ కరు మూడడు

గుల దూరంలో కూర్చోవాలి. గురుకులంలో క్లాసులలో విద్యార్థులు మూడడుగుల దూరంలో కూర్చొని చదువుకొనేవారు. ఇప్పటిలా ఒకే క్లాసు రూములో 40మంది, 60మందిని కూర్చోపెట్టలేదు. జాతి వివక్షతో పనిలేకుండా ఎవరూ ఎవరినీ తాకరాదు. ఇది మన వేదాలు చెప్పి శౌచసూత్రాలు. అనగా ఆరోగ్య సూత్రాలు. ఇవన్నీ నిన్న మొన్న టిదాకా చాదస్తుల ఛాందసాలు. ఇంకా చెప్పాలంటే మూఢాచారా లు. కాని ఇపుడు అనగా కరోనా పుణ్యమా అని సోషల్‌ డిస్టెన్స్‌ అంటు న్నారు. అంటే అస్పృశ్యతను ఆమోదించినట్లే కదా! కాళ్ళు చేతులు కడుక్కోవాలి అంటున్నా రు. శౌచము (శుభ్రత), ముఖవస్త్రం అంటే మాస్క్‌ ఇవన్నీ సార్వకాలిక ఉప యోగాలుగా, ఆరోగ్యసూత్రాలు గా ఆచారసూత్రాలను మన వేదా లు, ధర్మశాస్త్రాలు అంటే స్మృతు లు- విష్ణుస్మృతి, వసిష్ఠస్మృతి, నా రదస్మృతి, పరాశరస్మృతి ఇత్యా దులలో చెప్పే ఉన్నారు. మన ము మన అవసరాలకు, ఆశలకు, సౌ కర్యాలకు అశౌచార సూత్రాల కు నీళ్ళు వదిలేశాం. భయంకర వ్యాధి ప్రపంచాన్ని వణికిస్తుంటే ఎపు డో భారతీయ సనాతనధర్మ సూత్రాలు ఇపుడు గుర్తొచ్చి ఇలా మాస్క్‌ ధరించడం, చేతులు కడుగుకోండి, దూరంగా ఉండండి, గుంపులు గా చేరకండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని బోధిస్తున్నారు.
ఇవన్నీ నారాయణుడు తాను స్వయంగా ఆయా ఋషుల రూపంలో ప్రపంచం మొత్తము ఆరోగ్యంగా ఉండటానికి కావ లసిన రాజ్యాంగాన్ని స్మృతుల రూపంలో అనువాక ముల రూపంలో అందించి ఉన్నారు. ప్రాణులను సృష్టించాడు. అలా సృష్టించబడిన ప్రాణులు ఆరో గ్యంగా, ఆనందంగా బ్రతకటానికి ఆచా రసూత్రాల పేరుతో ఆరోగ్యసూత్రాలను అందించిన పరమాత్మ ఔదార్యం ఎం తటిదని చెప్పగలమో? ఆలోచించండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement