Tuesday, February 13, 2024

MDK : ఓటు హక్కు వినియోగించుకున్న బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి నీలం మధు ముదిరాజ్

పటాన్ చెరు నియోజకవర్గ బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన స్వగ్రామం చిట్కుల్ గ్రామంలో నీలం మధు ముదిరాజ్ ఓటు వేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజల చేతిలో ఉన్న వజ్రాయుధమైన ఓటును వినియోగించుకుంటేనే ఉజ్వల భవితకు బంగారు బాటలు వేసుకోవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా నిష్పక్షపాతంగా ఓటు హక్కును వినియోగించుకొని సుపరిపాలన అందించే నాయకుడిని ఎన్నుకోవాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement