Saturday, May 4, 2024

TS: మళ్లీ బీఆర్ఎస్ దే విజయం.. కేసీఆర్

మళ్లీ మన పార్టే విజయం సాధిస్తుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు. తెలంగాణ భవన్ లో పార్టీ నేతలతో భేటీ సందర్భంగా కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై దిశానిర్దేశం చేస్తున్నారు. ఎవరూ తొందర పడొద్దన్నారు. అభ్యర్థులందరూ సహనంతో ప్రచారం చేయాలన్నారు. కోపతాపాలను అభ్యర్థులు పక్కన పెట్టాలన్నారు. ప్రతి కార్యకర్త దగ్గరకు వెళ్లాలన్నారు. బీఆర్ఎస్ పై విపక్షాలు కుట్రలు చేస్తాయన్నారు. ప్రజల్లో గెలిచినా సాంకేతిక అంశాలతో కుట్ర చేస్తారన్నారు. ఇందుకు శ్రీనివాస్ గౌడ్ అంశమే ఉదాహరణ అన్నారు. ప్రతి విషయంపై అభ్యర్థులు క్లారిటీతో ఉండాలన్నారు.

ఎన్నికల ఘట్టంలో చాలా కీలకంగా వ్యవహరించాలన్నారు. వేములవాడలో న్యాయపరమైన సమస్యలతో ఇబ్బందులతో అభ్యర్థిని మారుస్తున్నట్లు తెలిపారు. సామరస్యపూర్వకంగా సీట్ల సర్దుబాట్లు చేస్తున్నామన్నారు. ప్రతి కార్యకర్తతో నేతలు మాట్లాడాలన్నారు. 51 బీ ఫామ్ లు మాత్రమే రెడీ అయ్యాయన్నారు. మిగతా బీ ఫామ్ లు సిద్ధమవుతున్నాయన్నారు. ఇవాళ, రేపు బీ ఫామ్ లు అందజేయనున్నట్లు తెలిపారు. సీట్లు రాని వాళ్లకు చాలా అవకాశాలున్నాయన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement