Monday, April 29, 2024

BRS Trouble – ఓరుగ‌ల్లులో గులాబీ వ‌ర్గ పోరు..

ఉమ్మడి వరంగల్‌, ప్రభన్యూస్‌ బ్యూరో:

ఎన్నికలు సమీపిస్తున్న వేళా…అధికార బిఆర్‌ఎస్‌ పార్టీలో వర్గపోరు బహిర్గతమవుతున్నది. అధికారపార్టీ ఎమ్మెల్యేలపై ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఏ ముఖం పెట్టుకొని మా గ్రామాలకు వస్తున్నావ్‌…అంటూ ఎమ్మెల్యేలను నిల దీస్తున్నారు. ప్రభుత్వం నుంచిఅందించే అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అర్హులకు ఇవ్వకుండ కమీషన్ల కోసం అమ్ముకుం టున్నారంటూ ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలను ని లదీస్తున్నారు. గ్రామాల్లో అడుగు పె ట్టొద్దంటూ ఊరు చివరిలోనే వస్తున్న కాన్వాయికి అడ్డంగా పడుకుంటున్నారు. ఉమ్మడివరంగల్‌ జిల్లాలో గత వారం రోజుల నుంచి డోర్నకల్‌, మహబూబా బాద్‌, స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గాల్లో ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలకు సమాధానాలు చెప్పలేక పరుషపదజాలంతో దూషిస్తూ మీ ఎనుక ఎవరో ఉండి నడిపిస్తున్నారంటూ అసహనాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. డోర్నకల్‌ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ను గ్రామాలకు రావొద్దంటూప్రజలు అడ్డుకోవడమే కాకుండా వాహన కాన్వాయికి అడ్డంగా కిందపడుకొని ముందుకు రానివ్వడం లేదు.

మహబూబాబాద్‌ నియోజక వర్గ ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌ ఉద్యమకారులను విస్మరించడంతో పాటు భూ కబ్జాలు, ల్యాండ్‌ సెటిల్మెంట్‌ తదితర అవినీతి కార్యక్రమా లకు పాల్పడుతుంటడంతో శంకర్‌నాయక్‌ మాకొద్దంటూ బాహాటంగా గ్రామాల్లో తీర్మాణాలు, మామిడితోటలో ఉద్యమకారులు రహస్య సమావేశాలు పె ట్టి అధినేతకు తమ నిర్ణయాలను తెలియజేస్తున్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య నియోజకవర్గంలో వర్క్‌లను, ప్రభుత్వ పథకాలను, చివరకు ఉద్యోగాల్లో చొప్పున పర్సంటేజీల ు తీసుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నారని నిలదీస్తున్నా రు. రాజయ్య ఎమ్మెల్సీకడియం శ్రీహరిని లక్ష్యంగా చేసుకొని విమర్శల దాడి చేయడంతో ఇద్దరి పంచాయతీ ప్రగతి భవన్‌కు వెళ్లింది.

గ్రామాల్లో అభివృద్ది చేయలేదంటూ రెడ్యానాయక్‌ను అడ్డుకుంటున్న గిరిజనులు

- Advertisement -

ముఖ్యమంత్రి కేసిఆర్‌ దళిత, గిరిజనుల కోసం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తుండగా, వాటిని అర్హులకు అందివ్వకుండా కమీషన్లకు అమ్ముకుంటున్నా రంటూ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ను నియోజకవర్గప్రజలు నిలదీస్తున్నారు. నిరుపేదల కోసం నిర్మాణం చేస్తున్నటువంటి డబుల్‌ బెడ్రూమ్‌ ఇండ్లను అర్హులకు ఇవ్వకుండా తన అనుచ రులకే ఇవ్వడంపై నిలదీస్తున్నారు. అదేవిధంగా దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలని సీఎం కేసిఆర్‌ దళితబంధు పథకాన్ని అమలు చేస్తుండగా, ఆ పథకం కింద కూడా అర్హు లైనవారికి ఇప్పించకుండా రెడ్యానాయక్‌ మోసంచేస్తున్నా రంటూ గ్రామాల్లో నిలదీ స్తున్నారు.

తాజాగా కురవి మండలం మొగిలిచర్ల గ్రామానికివెళ్లగా ఓడిసిఎంఎస్‌ మాజీ చైర్మన్‌, కురవి బిఆర్‌ఎస్‌ మండల మాజీ అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డితో పాటు మరికొంత మంది అభివృద్ధి ఏం చేశావని, ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావంటూ నిలదీశారు. కురవి మండలంలోనే కంచర్లగూడెం తండాకు చెందిన దళిత, గిరిజనులు తమకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు, దళిత బంధు పథకం ఇవ్వలేదని మా గ్రామానికి రావొద్దం టూ గ్రామ పొలిమెరలోనే రెడ్యానాయక్‌ వస్తున్న కాన్వాయి కి అడ్డుగా పండుకొని నిలదీశారు. జై కేసిఆర్‌ అంటూ నినా దాలు చేస్తూనే రెడ్యానాయక్‌ గోబ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. గిరిజన మహిళా కర్రపట్టుకొని ఎవడ్రా మాఊరికి వచ్చేదంటూ ముందుగా వస్తున్న పోలీసులనుసైతం అడ్డుకొని రచ్చ…రచ్చ చేసింది. నూకలవేణుగోపాల్‌రెడ్డి అనుచరులు, మాజీఎంపీపీ గ ుడిబోయిన రామ్‌చంద్రయ్య వర్గీయులమధ్య తోపులాట, బాహాబాహిజరగగా పోలీసులు అడ్డుకున్నారు. దాదాపు గంట పాటుగ్రామంలోకి రాకుండా రెడ్యానాయక్‌ను అడ్జుకున్నారు. రెండు రోజులుగా కురవి మండలంలో రెడ్యానాయక్‌ ఏ ్గగ్రామానికివెళ్లిన..నిరసన వ్యక్తమవుతుండటంతో ముందస్తుగానే తనవెంట పోలీస్‌ ప్రొడక్షన్‌తో పాటు ప్రత్యేక బలగాలనుకూడా రప్పించుకుంటున్నారు.

అసలు ఏం జరుగుతుందంటే..
డోర్నకల్‌ టికెట్‌ రాష్ట్ర గిరిజన శాఖ మంత్రిసత్యవతి రాథోడ్‌ తో పాటు మహబూబాబాద్‌ ఎంపీ, ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ కూతురు మాలోతుకవిత అలాగే రెడ్యానాయక్‌ కొడుకు డిఎస్‌. రవిచంద్రఆశిస్తున్నారు. అధిష్టానం ఆదేశిస్తే డోర్నకల్‌ నుంచి పోటీ చేస్తానంటూ రెండు మాసాలక్రితం మంత్రి సత్యవతి ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి రెడ్యానాయక్‌ సత్యవతిని, ఆమె అను చరులను లక్ష్యంగాచేసుకొని మాట్లా డటం ప్రారంభించారు. ఇదిలా ఉంటే రెడ్యా కూతురు కవిత ఈసారి తనకు అవకాశం ఇవ్వాలంటూ తండ్రిని కోరిం ది. పోటీ చేస్తే నువ్వే పోటీచేయాలే తప్ప చెల్లెకు టికెట్‌ ఇవ్వొద్దంటూ కొడుకు రవిచంద్ర తండ్రిపై ఒత్తిడితెచ్చారు. ఒక వైపున రెడ్యాపై ఇంటిపోరు కూడా సాగుతోంది. మరోవైపున సత్యవతి వర్గం అడుగడుగున అడ్డుకుంటున్నది. వీరితో పాటు ప్రజల నుంచి కూడా రెడ్యాపై వ్యతిరేకత పెల్లుబిక్కుతున్నది. రెడ్యా మాత్రం ఇదే నా చివరి పోటీ నాకు మరో అవకాశం కల్పించాలంటూ ప్రజలను అభ్యర్దిస్తున్నప్పటికీ.. రెడ్యాపై వ్యతిరేత మాత్రం తగ్గడంలేదు.

శంకర్‌నాయక్‌ వద్దు…
మహబూబాబాద్‌ బిఆర్‌ఎస్‌ అభ్యర్దిగా శంకర్‌నాయక్‌కు టికెట్‌ ఇవ్వొద్దంటూ మానుకోటప్రజలు ముక్తకంఠంతో వ్యతిరేకి స్తున్నారు. తెలంగాణఉద్యమ సమయంలో మాను కోటకు వైఎస్‌. జగన్‌ వస్తున్నసందర్భంగా పార్లమెంట్‌లో తెలంగాణ వద్దని ప్లకార్డు పట్టుకొన్న జగన్‌ మానుకోటలో ఎలా అడుగు పెడతారంటూ ప్రాణాలను సైతం లెక్కచేయ కుండా ఎదురొడ్డిన ఉద్యమనాయకులను పట్టించుకున్న దాఖలాలులేవు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు, కమీషన్లకు కక్కుర్తిపడుతూ తనవర్గీయులకే డబ్బులు తీసుకొని అమ్ముకుంటున్నారే తప్ప పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను పట్టించుకోవడంలేదంటూ ఉద్యమ కారులను ఆరోపిస్తున్నారు. శంకర్‌నాయక్‌ వద్దేవద్దంటూ ఉద్యమకారులు మానుకోటలోని మామిడి తోటలో రహస్య సమావేశాలు పెట్టుకొని ఏకగ్రీవ తీర్మాణం చేసుకున్నారు. ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‌రావు సహకారంతో నేరుగా సీఎం కేసిఆర్‌ను కలిసి మానుకోట జిల్లాకేంద్రంలో శంకర్‌ నాయక్‌ చేస్తున్నటువంటి భూ దందా, అవినీతి తదితర అంశాలపై ఫిర్యాదు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. ఇదిలా ఉంటే గురువారం కేసముద్రం మండలంలో వివిధ అభివృద్ది పనులను ప్రారంభించేందుకు వెళ్లగా సర్పంచ్‌లు సమావేశమై శంకర్‌నాయక్‌ను మండలంలోకి రానివ్వ ద్దంటూ ఏకగ్రీవంగా తీర్మాణం చేసుకున్నారు. కేసముద్రం సర్పంచ్‌ శ్రీనివాస్‌ నేతృత్వంలో శంకర్‌నాయక్‌కు టికెట్‌ ఇవ్వకుండా ఎవరికి ఇచ్చినా…భారీ మెజార్టీ తో గెలిపిస్తామని తీర్మాణం చేసి ఆ తీ ర్మాణాన్ని నేరుగా సీఎం కేసిఆర్‌కు అందజేయాలని నిర్ణయించుకున్నారు.

స్టేషన్‌ఘన్‌పూర్‌లోనూ ఎమ్మెల్యే ంాజయ్యపై అవినీతి ఆరోపణలు, వేధింపుల మరకలు

స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యపై గత తొమ్మిదేళ్ళ నుంచి అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నియోజకవర్గ అభివృద్ధి కోసం వ చ్చి నటు వంటి సీడీఎఫ్‌ నిధులు కావోచ్చు…ఉపాధి హామీ నిధులు కావోచ్చు.. ఏ నిధులు వచ్చినా…క మీషన్లు తీసుకొని అమ్ము కుంటున్నారని బిఆర్‌ ఎస్‌ ప్రజలు, ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. అంగన్‌వాడీ కార్యకర్త, ఆయా, ఆశా వర్కర్లతో పాటు ఇతర ఉద్యోగాల విషయంలో కూడా డబ్బులు ఇచ్చినవారికే ఉద్యోగా లంటూ బాహటంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. విచిత్రమైన విషయం ఏమిటంటే ఒకే అంగన్‌వాడీ పోస్టుకు పది మంది వద్ద డబ్బులు వసూలు చేసిన సంఘటన స్వయంగా ఆనాటి ఉద్యమంలో తన్నీరు హరీష్‌ రావు ఎదుటే ఏకరువు పెట్టుకు న్నారు. రాజయ్య కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టిఆర్‌ఎస్‌లో చేరిన స ందర్భంలో ఉప ఎన్నికల ఇంచార్జీగా వచ్చినటువంటి హరీష్‌రావు ఎదుటే బాధిత మహిళలు తమ గోడును వెల్లబోసుకోగా, హరీష్‌ రావు చొరవ తీసుకొని రాజయ్య నుంచి డబ్బులు ఇప్పిం చారు.

ఆరోజు నుంచి ఈ రోజు వరకు రాజయ్య ఏ సంక్షేమ పథకం వచ్చినా…కమీషన్లు లేకుండా ఇచ్చేదిలేదు. చివరకు దళిత బంధు పథకంలో 2 లక్షలు ఇస్తేనే ఇస్తామని బాజాప్తుగా వసూలు చేసిన సంఘటనలు ఉన్నాయి. ఇదంతా ఒకఎత్తయితే ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్న కడియం శ్రీహరితో వచ్చే ఎ న్నికల్లో తనకు ప్రమాదం పొంచి ఉన్నదని గ్రహించిన రాజయ్య కడియం శ్రీహరిపై ఎన్‌కౌంటర్ల సృష్టికర్త అంటూ…అసలు దళితుడే కాదంటూ…వేల కోట్ల రూపాయ లను సం పాదించాడంటూ అనేకఆరోపణలు చేసిన నేపథ్యం లో ప్రగతి భవన్‌కు బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ అధ్యక్షులు కేటిఆర్‌ రాజయ్యను పిలిపించి మందలించి పంపించినట్లు సమా చారం. విమర్శలు మానుకొని కలిసి పని చేయాలంటూ రాజయ్యకు హితోపదేశం చేసి పంపించినట్లు సమాచారం. మొత్తంగా రాష్ట్రంలోనే ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో అత్య ధికంగా అసెంబ్లిd నియోజకవర్గాల్లో వర్గపోరు, అంతర్గత పోరు జరుగుతుండటం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement