Friday, May 3, 2024

Editorial – చ‌దువు , సృజ‌న ఒకేసారి సాగాలి….

సృజనకూ, చదువుకూ సంబంధం ఉందా? అంటే తప్పకుండా ఉంది.సృజనను పెంచేదే చదువు.రెండూ ఏకకాలంలో సాగాలి. బ్రిటిష్‌ వారి కాలంలో వారి అవసరాల కోసం భారతీయులను గుమాస్తాలుగా తయారు చేయడానికి అనువైన విద్యావిధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రస్తుతం కొద్ది మార్పులతో అదే విద్యావిధానం కొనసాగుతోంది. చదువు పూర్తి కాగానే ఏం పని చేయాలనే ప్రధానమైన ప్రశ్న యువతరాన్ని వేధిస్తోంది . తమ చదువుకు ఏ ఉద్యోగం వస్తుందో వారికే తెలియదు. పరిశ్రమల్లో నైపుణ్యం కావాలంటున్నారు. నైపుణ్యం లేని చదువు వ్యర్ధం. ఈ కారణంగా కొన్ని ప్రభుత్వ,ప్రైవేటు కళాశాలల్లో వృత్తి విద్యాకోర్సులను ఇప్పటికే నిర్వహిస్తున్నారు. ఇవి కాకుండా నైపుణ్యాన్ని పెంచేందుకు కొన్ని పరిశ్రమలతో అప్రంటిస్‌ కోర్సుల కోసం ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలతో సహా ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్నది.

విద్యార్ధుల ఎదుట ఇప్పుడు ప్రధానమైన సమస్య ఏమిటంటే,అనుచరులుగా కొనసాగాలా,లేక అన్వేషకు లుగా వృద్ధి చెందాలా అని.మన దేశంలోనే కాకుండా, యావత్‌ ప్రపంచంలో ఇప్పుడు అన్వేషకుల అవసరం ఎంతో ఉంది. వారినే క్రియేటర్స్‌ అని కూడా అనొచ్చు. వారి డిమాండ్‌ రోజురోజుకీ పెరుగుతోంది.వారు ప్రారంభించే స్టార్ట్‌ప్‌లకు ప్రభుత్వం నుంచి సాయం లభిస్తోంది. మన దేశంలో 2014లో 350 స్టార్టప్‌లు మాత్రమే ఉండేవి. ఇప్పుడవి 90వేలుపైగా పెరిగాయి.వీటిలో ప్రభుత్వ గుర్తింపు పొందినవి చాలా ఉన్నాయి. ఐటి లో మాదిరిగానే స్టార్టప్‌లలో బెంగళూరు అగ్రస్థా నంలో ఉంది.మన దేశంలో స్టార్టప్‌ల విలువ ఆరు బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. స్టార్టప్‌లకు సృజనే ఆలంబన. స్టార్టప్‌లు పెరుగుతున్నాయంటే సృజనాత్మ కతకు విలువ పెరుగుతున్నట్టే. అయితే ఇది ఇంకా ఆరంభ దశలోనే ఉంది. ప్రస్తుతం క ృత్రిమ మేథకు ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోంది. విద్యారంగంలో మార్పులకు ఇప్పుడే విప్లవాత్మక అడుగులు వేయాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పిలుపు ఇచ్చారు.

మార్పు అన్నది విశ్వవిద్యాలయాల నుంచే ప్రారంభం కావాలన్నారు.మన యువత అం తర్జాతీయ స్థాయిలో పోటీ పడేందుకు ఆధునిక,సాంకేతి క పరిజ్ఞానాన్ని పుణికి పుచ్చుకోవల్సిన అవసరం ఉంది. గతంలో మాదిరి ఏవో కొన్ని ప్రశ్నలకు జవాబులను సిద్ధం చేసుకుని పరీక్షలకు వెళ్ళి పట్టాలు సంపా దించుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. ఈ విషయాన్ని ఆధునిక విద్యా వేత్తలు తరచూ స్పష్టం చేస్తున్నారు. ఇంజ నీరింగ్‌, మెడికల్‌ కళాశాలల విస్తరణ గతంతోపోలిస్తే చాలా ఎక్కువగా జరిగింది. అయితే,ఆ రెండు రంగాల్లో కూడా నిరుద్యోగులు ఎంతో మంది మిగిలి పోతున్నారు, ఇంజనీరింగ్‌ విద్యాధికులకు ఇప్పుడు స్టార్టప్‌లు ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నాయి. కాలేజీల్లో తాము అభ్యసించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆచరణలో చూపించేందుకు విద్యార్ధులు అన్వేషణ మార్గాన్ని ఎంచుకుంటున్నారు.డిగ్రీ లకు బదులు సాంకేతికంగా శిక్షణనిచ్చే కోర్సులకు విద్యార్ధులు మొగ్గు చూపుతున్నారు.

దేశంలో వేలాది మందిసాంకేతిక విద్యా నిపుణులు ఇప్పటికే తయారయ్యారు.మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలామ్‌ పదేళ్ళక్రితమే స్టార్టప్‌ గురించి యువ తరానికి బోధించారు.మన దేశంలో పారిశ్రామికంగా అభివృద్ధిని సాధించేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నా యనీ,ఇందుకు తగిన మోటివేషన్‌, ఇన్నోవేషన్‌, ఇంప్లిమెంటేషన్‌ తక్షణ అవసరమని ఆనాడే ఆయన ఉద్భోదించారు.ఆయన ప్రసంగాల ప్రభావం మన విద్యార్ధులపై బాగా ఉంది.అందుకే,ఇప్పుడు హైద రాబా ద్‌లో ఎన్నో స్టార్టప్‌లు వచ్చాయి.అంతరిక్ష రంగానికి సంబంధించిన రాకెట్ల విడిభాగాలను మన యువ ఇంజనీర్లు తయారు చేస్తున్నారు.స్టార్టప్‌ల వల్ల యువత ఆలోచనా విధానాల్లో కూడా చాలా మార్పు వచ్చింది.కృత్రిమ మేధ వల్ల ఎన్నో ప్రయోజనా లున్నా యని మన యువత రుజువు చేసి చూపుతున్నారు.

- Advertisement -

మన విద్యా విధానం ప్రపంచ దేశాలతో పోటీ పడేలా తయా రవుతోంది. మన దేశంలో శిక్షణ పొందిన యువత ఎక్కడైనా ఉపాధి లభించే స్థితికి చేరుకుంది. ప్రధా నమంత్రి నరేంద్రమోడీ అధికారాన్ని చేపట్టిన తర్వాత స్టార్టప్‌లను పెంచాల్సిన అవసరం గురించి పదేపదే నొక్కి చెబుతున్నారు.తెెలంగాణ, కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్‌లలో ఈ స్టార్ట్‌ప్‌లు ఎక్కువగా కనిపిస్తు న్నాయి. ప్రపంచ దేశాలతో పోటీ గల విజ్ఞానం, నైపుణ్యం మన సొంతమవుతోంది.భారత దేశానికి ఇది మంచి పరి ణామం. ఫార్మా రంగంలో,పరిశోధనా రంగంలో మన దేశంఎంతో పురోభివృద్దిని సాధించిందనడానకి కరోనా వ్యాక్సిన్‌ని రూపొందించి ప్రపంచ దేశాలకు అందజే యడమే తార్కాణం. యూనివర్సిటీ వీసీలనుద్దేశించి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చేసిన సూచనలు విప్లవాత్మకమైనవి. భావి విద్యా విధానానికి కరదీపికలుగా కొత్త విధానాలకు రూపకల్పన చేయాలని ఆయన ఇచ్చిన పిలుపు అని రాష్ట్రాలకూ వర్తిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement