Sunday, May 5, 2024

తెలంగాణ పథకాలు ఎక్కడైనా ఉన్నాయా – డాక్టర్ సంజయ్

కోరుట్ల. – నిరుపేదల సంక్షేమం కోసం తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశంలో ఎక్కడైనా ఉన్నాయా అని కోరుట్ల బారాస అభ్యర్థి డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ప్రశ్నించారు. మంగళవారం కోరుట్లలోని 23వ వార్డులో ఇంటింటా ప్రచారం నిర్వహించి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. కాంగ్రెస్ హయాంలో 200 రూపాయలు పించనుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు వేలకు పెంచారని, 500 రూపాయలు ఉన్న వికలాంగుల పెన్షన్ ను 4016 కు పెంచారన్నారు. మేనిఫెస్టోలో మరిన్ని ఆకర్ష నీయమైన ప్రకటనలు వస్తాయన్నారు.

. కాంగ్రెస్ అధికారం కోసం ఆరు గ్యారంటీలు అని, హామీలుస్తుందని వాటిని మోసపోవద్దన్నారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే మూడు గంటల కరెంటు మాత్రమే వస్తుందని, బిఆర్ఎస్ కు ఓటేస్తే మూడు పంటలు పండుతాయన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేనంత అభివృద్ధి ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు చేసి చూపారన్నారు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి గులాబీ జెండా ఎగిరేల సహకరించాలని కోరారు. కోరుట్ల నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని, 24 గంటల పాటు అందుబాటులో ఉండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. ప్రచారంలో ప్రజాప్రతినిధులు, బారాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement