Thursday, April 25, 2024

గ్యాస్ ధ‌ర పెంపుపై బిఆర్ఎస్ గ‌రం గ‌రం – శుక్ర‌వారం నాడు నిర‌స‌న‌ల‌కు శ్రీకారం ..

హైద‌రాబాద్ – గృహ వినియోగ గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర పెంచ‌డం ప‌ట్ల బిఆర్ఎస్ పార్టీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.. తాజా రూ.50 పెంపుతో గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర రూ 1160కి చేరింది.. ఈ గ్యాస్ ధ‌ర‌లు ఇలా పెంచుకుంటూ పోవ‌డం వ‌ల్ల వంట ఇంటిలో గృహిణులు ఇబ్బందులు ప‌డుతున్నారంటూ ఆ పార్టీ పేర్కొంది.. ప్ర‌ధానిగా మోడీ అధికారంలోకి రాక‌ముందు 450రూపాయిలున్న గ్యాస్ ధ‌ర ఇప్పుడు 1160కి చేరిందంటూ ,త‌క్ష‌ణం పెంచిన ధ‌ర‌ల‌ను వెంట‌నే త‌గ్గించాల‌ని పిలుపు ఇచ్చింది.. అంతే కాకుండా గ్యాస్ ధ‌ర పెంపును నిర‌సిస్తూ కేంద్రానికి వ్య‌తిరేకంగా శుక్ర‌వారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా నిర‌స‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల‌ని బిఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పిలుపు ఇచ్చారు.. ఈ నిర‌స‌న కార్య‌క్ర‌మాల‌లో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్య‌లో పాల్గొనాల‌ని కోరారు. కాగా,మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, మహిళా దినోత్సవం సందర్బంగా ప్రధాని మోడీ మహిళలకు గ్యాస్ ధర పెంచి గిప్ట్ ఇచ్చారంటూ అన్నారు.. అదాని షేర్ల ధరలు పడిపోవడంతోనే గ్యాస్ ధరను మోడీ పెంచేశారంటూ మండిపడ్డారు.. తక్షణం పెంచిన గ్యాస్ ధరను తగ్గించాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement