Friday, May 17, 2024

మహారాష్ట్రలో బీఆర్ఎస్ బోణీ – గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తొలి విజయం

 మహారాష్ట్ర గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తొలి విజయం నమోదు చేసుకుంది. మహారాష్ట్రలోని అంబే లోహల్ గ్రామంలో జరిగిన గ్రామ పంచాయతీ ఉప ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థి గఫూర్ పఠాన్ విజయం సాధించారు. 115 ఓట్ల తేడాతో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచారు. దీంతో మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ నేతలు సంబరాలు జరుపుకుంటున్నారు. దీంతో మహారాష్ట్ర ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఖాతా తెరిచి మొదటి విజయాన్ని నమోదు చేసుకున్నట్టు అయ్యింది

Advertisement

తాజా వార్తలు

Advertisement