Wednesday, May 1, 2024

ఎన్టీఆర్ 30 టైటిల్ ఎనౌన్స్ మెంట్.. ఫస్ట్ లుక్ పోస్టర్‌ రిలీజ్ చేసిన మేకర్స్

కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ ప్రస్తుతం యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమా ఎన్టీఆర్ కి 30వ సినిమా కావ‌డంతో ఎన్టీఆర్ 30 అనే వ‌ర్కింగ్ టైటిల్ తో మూవీని స్టార్ట్ చేశారు. కాగా, రేపు ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్బంగా.. ఈ మూవీ నుంచి తాజాగా తారక్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.

ఈ లేటెస్ట్ పోస్ట‌ర్ సూపర్ సెన్సేషనల్‌గా కనిపిస్తోంది. అంతే కాకుండా ఈ మూవీ అఫీషియ‌ల్ టైటిల్ ని కూడా ఈ పోస్ట‌ర్ ద్వాదా ఎనౌన్స్ చేశారు మేక‌ర్స్. ఇన్ని రోజులు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన “దేవర” అనే టైటిల్ ని అధికారికంగా క‌న్ఫామ్ చేస్తూ పోస్ట‌ర్ రిలీజ్ చేశారు మేక‌ర్స్.

ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఎన్టీఆర్ అద్భుతమైన అవతార్‌లో బాకు పట్టుకుని కనిపించాడు. ఈ లుక్ లో ఫ్యాన్స్ కు గూస్‌బంప్స్ ఇవ్వడం ఖాయం. ఫస్ట్ లుక్ పోస్టర్ నిస్సందేహంగా అభిమానుల‌ అంచనాలను అందుకుంది అనే చెప్ప‌వ‌చ్చు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, ఎన్టీఆర్ కి ప్ర‌తినాయ‌కుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై హరికృష్ణ కె, మిక్కిలినేని సుధాకర్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. కాగా, దేవర ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement