Sunday, May 12, 2024

BRS – నిన్న స్కూటీ… నేడు కారు..లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత… వినూత్న ప్రచారం..

నిజామాబాద్ సిటీ, : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వినూత్న రీతిలో ఎన్నికల ప్రచారం లో పాల్గొంటూ బీఆర్‌ఎస్‌ క్యాడర్‌లో జోష్‌ నింపుతున్నారు. నిన్నటికి నిన్న బీఆర్‌ఎస్‌ బోధన్‌ అభ్య ర్థి షకీల్ నామినేషన్ సందర్భంగా స్కూటీ నడిపి అందరిని ఆకట్టు కున్నారు. శుక్రవారం నిజామా బాద్ అర్బన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే గణేష్ గుప్తా నామినేషన్ కార్యక్రమంలో భాగంగా.. బీఆరెస్ పార్టీ ఎన్నికల గుర్తు నమూనాగా గులాబీ అంబాసిడర్ కారును స్వయంగా నడిపి హల్‌చల్‌ చేశారు కవిత. ఎమ్మెల్యే అంబాసిడర్ కారు నడిపి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. ఆమె కారు వెనుక పార్టీ శ్రేణులు బైక్‌లు, కార్లతో భారీగా ర్యాలీగా సాగారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement