Friday, May 3, 2024

Renuka Chowdhury: కాంగ్రెస్‌లోకి వ‌స్తామంటున్న బీఆర్ఎస్ నేత‌లు…రేణుకా చౌదరి

కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, మాజీ ఎంపీ రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కాంగ్రెస్ కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లాక్కుందని… ఈసారి పరిస్థితి వేరుగా ఉందని చెప్పారు.

ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థుల నుంచి తమకు ఫోన్లు వస్తున్నాయని… తనకు కూడా కొందరి నుంచి ఫోన్లు వచ్చాయని తెలిపారు. తమను మర్చిపోవద్దని, తమను గుర్తుంచుకోవాలని, అవసరమైతే తాము కాంగ్రెస్ కు మద్దతుగా ఉంటామని బీఆర్ఎస్ అభ్యర్థులు ఫోన్లు చేసి చెపుతున్నారని అన్నారు. తమకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవసరం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజార్టీతో గెలుస్తుందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement