Saturday, February 17, 2024

Vijayawada : ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఉన్న కనీస దుర్గమ్మ దర్శనానికి శనివారం సతీసమేతంగా చంద్రబాబు లాగా ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆలయ మర్యాదలతో చంద్రబాబుకి స్వాగతం పలికిన ఇన్చార్జి ఈవో, ఆలయ ఈఈ కోటేశ్వరరావు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు. జగన్మాతకు ప్రత్యేక పూజలను చంద్రబాబు దంపతులు నిర్వహించారు. అనంతరం వేద ఆశీర్వచన మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేయగా ఆలయ ఈ కోటేశ్వరరావు, ఏఈఓ చంద్రశేఖర్, స్థానాచార్యులు ఇతర అధికారులు అమ్మవారి చిత్రపటం ప్రసాదాలను చంద్రబాబు దంపతులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఎంపీ కేసినేని నాని జిల్లా పార్టీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం తో పాటు తెదేపా నేతలు కేశినేని చిన్ని, ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ, అశోక్ బాబు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న, మాజీ మంత్రులు దేవినేని ఉమా కొల్లు రవీంద్ర మాజీ ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య బోండా ఉమా మాజీ ఎంపీ మాగంటి బాబు ద్వితీయ శ్రేణి తృతీయని కార్యకర్తలు నాయకులు ఉన్నారు.

ఈనెల ఐదో తేదీన శ్రీశైలం మల్లన్న సేవలో చంద్రబాబు పాల్గొననున్నారు. అలాగే రానున్న రోజుల్లో కడప దర్గా, గుణదల మేరీ మాత చర్చిలను తెలుగుదేశం అధినేత చంద్రబాబు దర్శించుకోనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement