Thursday, May 2, 2024

BRS – పొరపాటున కూడా అలా చేయొద్దు .. నిలువునా మోస పోతాం: సిద్దిపేట కేడ‌ర్‌తో హ‌రీశ్‌రావు భేటీ

సిద్దిపేట – రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఅర్ఎస్ ప్రభుత్వమే. మనం పదేళ్లు పాలించినం.. వాళ్లు వచ్చి నాలుగు నెలలు కాలేదు. ప్రభుత్వంపై అప్పుడే వ్యతిరేకత పెరిగింది. కాంగ్రెస్ మీద కోపంతో బీజేపీకి ఓటేస్తే పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు అయితదని మాజీ మంత్రి హరీశ్ రావు హెచ్చరించారు. మెదక్ లోక్‌స‌భ‌ ఎన్నికలపై శుక్రవారం కొండ భూదేవి గార్డెన్‌లో సిద్దిపేట పట్టణ బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సిద్దిపేటలో సగం కట్టిన వెటర్నరీ కాలేజీని రద్దు చేసి సీఎం రేవంత్‌ రెడ్డి కొడంగల్‌కు తరలించుకు పోయాడని ఆరోపించారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అని గంభీర ఉపన్యాసాలు ఇచ్చారు. ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. రేవంత్ రెడ్డి దగ్గర సరుకు లేదు, పని లేదని విమర్శించారు. బీజేపీ పేదలకు, తెలంగాణకు వ్యతిరేక పార్టీ.

బీఆర్‌ఎస్‌ను ఖతం చేయాలనే కుట్ర..

- Advertisement -

సిలేరును లాక్కుని మనకు అన్యాయం చేసిన పార్టీ అని గుర్తు చేశారు. పదేళ్లలోబీజేపీ చేసిన ఒక్క మంచి పని ఉందా? అని సూటిగా ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అని రేవంత్ రెడ్డి బురదజచ ల్లిండ్లు.. ఇప్పుడు మోదీని బడేమియా అంటుంటున్నడని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై తెలంగా ణలో బీఅర్ఎస్ లేకుండా చేయాలనే కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. ప్రత్యర్థుల తప్పుడు ప్రచారాలను సోషల్ మీడియా వేదికగా కార్యకర్తలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. బీజేపీని ఓడించే శక్తి బీఆర్‌ఎస్‌కే ఉందని ముస్లిం సోదరులు గుర్తించాలి. ఇచ్చిన హామీలు తప్పిన కాంగ్రెస్ మెడలు వంచాలంటే ఎంపీ ఎన్నికల్లో బీఅర్ఎస్ పార్టీని గెలిపించాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement