Sunday, April 28, 2024

BRS – వరుసగా మూడోసారి కేసీఆర్ చేతులమీదుగా బీఫామ్ అందుకున్న గంగుల

హైద‌రాబాద్ – రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా నేడు హైదరాబాద్లో బీఫామ్ అందుకున్నారు రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్. వరుసగా కరీంనగర్ నుండి మూడు పర్యాయాలు హాట్రిక్ విజయాలు సాధించిన గంగుల నేడు మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా పార్టీ బిఫామ్ అందుకోవడం విశేషం. ఈసందర్భంగా తనపై నమ్మకంతో కరీంనగర్ నుండి పోటీకి అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేసారు మంత్రి గంగుల కమలాకర్. ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతు ప్రతిపక్షాలకు అందనంత దూరంలో నిలవడంతో పాటు నియోజకవర్గ అభివృద్దిలో తనదైన మార్కుతో రాష్ట్రంలో ఆదర్శనియోజకవర్గంగా తీర్చిదిద్దిన గంగుల గెలుపు భారీ మెజార్టీతో ఉంటుందంటున్నారు స్థానిక ప్రజలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement