Monday, February 19, 2024

BRS Demand – రైతు బంధు ఎప్పుడిస్తారు…వ‌డ్ల‌ను బోన‌స్ తో ఎప్పుడు కొంటారు – రేవంత్ ను ప్ర‌శ్నించిన హ‌రీష్ రావు

హైద‌రాబాద్ : పెంచిన రైతు బంధును చెల్లింపు ఎప్పుడో.., రూ.500 బోన‌స్ తో వ‌డ్ల‌ను ఎప్పుడు కొంటారో చెప్పాలంటూ రేవంత్ రెడ్డి స‌ర్కార్ ప్ర‌శ్నించారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హారీష్ రావు.. ఎమ్మెల్యేగా ప్ర‌మాణ స్వీకారం చేసిన అనంత‌రం ఆయ‌న అసెంబ్లీ మీడియా పాయింటు వ‌ద్ద మాట్లాడుతూ, ఎన్నిక‌ల త‌మ‌రు చేసిన వాగ్దానాల ప్ర‌కారం అధికారంలోకి వ‌చ్చాక‌ డిసెంబర్ 9వ తేదీన రైతు బంధు కింద రూ. 15 వేలు ఇస్తామని చెప్పారు… ఎప్పుడు రైతు బంధు ఇస్తారో చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

వడ్లు అమ్ముకొకండి.. తాము బోన‌స్‌తో వడ్లు కొనుగోలు చేస్తామని కాంగ్రెస్ నేత‌లు ఎన్నిక‌ల ప్ర‌చారంలో చెప్పారు. అధికారంలోకి వచ్చారు.. రూ. 500 బోనస్‌తో వడ్లు ఎప్పుడు కొంటారో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. అంతేకాకుండా మిగ్‌జాం తుపాను కార‌ణంగా కొన్ని చోట్ల వ‌డ్లు త‌డిశాయ‌ని, అలాంటి రైతుల‌ను ఆదుకోవాల‌ని కోరారు. రైతాంగం అంతా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తోంద‌ని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement