Monday, February 19, 2024

Tirumala – శ్రీవారి సేవ‌లో లాలూ ప్ర‌సాద్ యాద‌వ్

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌యాదవ్ శనివారం తిరుమల లోని శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించు కున్నారు. లాలు ప్రసాద్‌ యాదవ్ తో పాటు మాజీ ముఖ్యమంత్రి రబ్రిదేవి, కుమారుడు తేజస్వి యాదవ్‌, కుటుంబ సభ్యులు శ్రీవారి దర్శనంలో పాల్గొన్నారు. స్వామి వారి దర్శనం అనంతరం హుండీలో కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అంత‌కు ముందు
తిరుమ‌ల‌కు చేరుకున్న ఆయ‌న‌కు ఆలయ మర్యాదల ప్రకారం టీటీడీ అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు . పూజల అనంతరం తీర్థప్రసాదాలను అందజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement