Tuesday, April 30, 2024

Rashmika: రూట్ మార్చిన ర‌ష్మిక‌…క్యూట్ చూపుల‌తో వేట ..

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న బాలీవుడ్‌ లో యానిమల్‌ సినిమా తో సక్సెస్‌ ను దక్కించుకుంది. అంతకు ముందు రెండు హిందీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ముద్దుగుమ్మ రష్మిక మందన్న కమర్షియల్‌ గా సక్సెస్ లను దక్కించుకోవడం లో విఫలం అయింది.

కానీ ఇప్పుడు రష్మిక మందన్న యానిమల్‌ తో ఏకంగా బాలీవుడ్ టాప్‌ హీరోయిన్స్‌ జాబితాలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక సోష‌ల్ మీడియాలో గ్లామ‌ర్ షోతో యూత్ ను క‌ట్టిప‌డేసే నేష‌న‌ల్ క్ర‌ష్ రూట్ మార్చేసింది..తాజా ఫోటో షూట్‌ తో రష్మిక మందన్న ఆకట్టుకుంది. చీర కట్టులో చాలా అందంగా, క్యూట్‌ గా ఉన్నావంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇంత అందంగా, క్యూట్‌ గా ఎలా ఉంటారు మేడం అంటూ కొందరు ఈమెను ప్రశ్నిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement