Wednesday, May 1, 2024

తాగునీటి ట్యాంక్‌లో మృతదేహం.. మిస్టరీ డెత్ పై విచారణ

ఓ తాగునీటి ట్యాంక్ లో మృత‌దేహం బ‌య‌ట‌ప‌డింది. ఆ తాగునీటిని కొన్ని బ‌స్తీల ప్ర‌జ‌లు తాగుతున్నారు. అయితే ఆ వాట‌ర్ ట్యాంక్ లో ఓ మృత‌దేహం బ‌య‌ట‌ప‌డ‌డంతో అంద‌రూ నివ్వెర‌పోతున్నారు. వాట‌ర్ ట్యాంక్ లో మృత‌దేహం ఎలా అని.. ఈ ఘ‌ట‌న‌ హైదరాబాద్ లోని చిలకలగూడ ఎస్ఆర్కే నగర్‌లో జ‌రిగింది. ముషీరాబాద్‌ ఠాణా పరిధిలో జరిగిన ఘటనతో ప్రజలు, అధికారులు నిర్ఘాంత పోయారు. కృష్ణా పైప్‌లైన్‌ మరమ్మతుల నేపథ్యంలో ఇవాళ, రేపు నగరంలో నీటిసరఫరా నిలిపివేయనున్నారు. ఈక్రమంలో జలమండలి అధికారులు SRK నగర్‌లోని ట్యాంకును శుభ్రం చేయాలని నిర్ణయించారు. పనికోసం వచ్చిన కాంట్రాక్టరు సిబ్బంది.. మూత తీసి చూడగా అందులో కుళ్లిన మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు.. విపత్తు నిర్వహణ సిబ్బంది… 6 గంటలు శ్రమించి మృతదేహాన్ని బయటకు తీశారు.

ఇదిలా ఉంటే… పది లక్షల లీటర్ల నిల్వ సామర్థ్యమున్న ఈ ట్యాంక్‌…. రాంనగర్‌ డివిజన్‌లోని 10 బస్తీలకు నీటిని సరఫరా చేస్తుంది. కొద్ది రోజులుగా ఈ నీటిని తాగిన రిసాలగడ్డ, అంబేద్కర్‌నగర్‌, హరినగర్‌, కృష్ణనగర్‌, శివస్థాన్‌పూర్‌, బాకారం ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ట్యాంక్‌ వద్దకు చేరుకున్న పలువురు మహిళలు… తమకు ఆరోగ్య పరీక్షలు చేసేందుకు వైద్య శిబిరం నిర్వహించాలని భ‌యాందోళ‌న‌తో కోరుతున్నారు.

మృతదేహాన్ని వాటర్‌ ట్యాంక్‌ నుంచి బయటకు తీశారు. ఈ నేపథ్యంలో మృతి చెందిన వ్యక్తి అంబేద్కర్ నగర్ కు చెందిన కిషోర్ గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వాటర్‌ ట్యాంక్‌ వద్ద కనిపించిన చెప్పులను మృతుడి అక్క గుర్తించడంతో కిషోర్ అని వెల్లడించారు. కానీ వాటర్‌ ట్యాంక్‌పై రెండు ద్వారాలు ఉండగా.. అవిరెండూ కూడా మూసి ఉండటంతో కిషోర్‌ను ఏవరైనా చంపారా.. లేక ఇంకేమన్నా కారణాలు ఉన్నాయా.? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement