Wednesday, May 1, 2024

Breaking: హైదరాబాద్ అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో బ్లాస్ట్ ..

హైద‌రాబాద్‌లోని అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో బ్లాస్ట్ జ‌రిగింది. గౌలిగూడ గోల్ మసీదు వెనుక మొగరం బస్తీలో కెమికల్ బ్లాస్ట్ జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. కెమికల్ బ్లాస్ట్ లో ఒకరు భరత్ బాతోడ్ (కొడుకు) మృతి చెంద‌గా.. ఇంకొకరికి గోపాల్ బాతొడ్ (తండ్రి)కి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి పోలీసులు, క్లూస్ టీం చేరుకున్నాయి. అయితే.. మ్యాన్ హోల్ లో కెమికల్ వేసి నీళ్లు పోస్తుండగా ఒకేసారి ఈ బ్లాస్ట్ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఇంకొంత‌మంది చెత్త ఏరుకునే వ్య‌క్తి సంచిలో బ్లాస్ట్ జ‌రిగింద‌ని అంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement