Monday, June 24, 2024

TS ఫోన్ ట్యాపింగ్ పై సీబీఐ విచార‌ణ చేయించండి – గ‌వ‌ర్న‌ర్ కు బీజేపీ లేఖ

ఇప్ప‌టికే ఈ కేసులో న‌లుగు పోలీస్ అధికారులు అరెస్ట్
మ‌రికొంద‌రు అరెస్ట్ కు సిద్ధం
ఈ ట్యాపింగ్ లో గ‌త పాల‌కులు ప్ర‌మేయం
దీనిపై నిజాలు బ‌య‌ట‌కు రావాలంటే
సిబిఐ విచార‌ణ జ‌ర‌గాల్సిందే

రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారంపై సిబిఐ విచార‌ణ జ‌రిపించాల‌ని కోరుతూ రాష్ట్ర బిజెపి తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ రాధాకృష్ణ‌న్ ను కోరింది.. ఈ మేర‌కు ఆయ‌న‌కు ఒక లేఖ రాసింది.. ఈ లేఖ‌లో ట్యాపింగ్ పూర్వ‌ప‌రాల‌ను వివ‌రించింది.. ఇప్ప‌టికే ఈ కేసులో న‌లుగురు పోలీస్ ఉన్న‌తాధికారులు అరెస్ట్ అయ్యార‌ని తెలిపింది.. మ‌రికొంద‌రు పోలీసుల పై ద‌ర్యాప్తు కొన‌సాగుతున్న‌ద‌ని వెల్ల‌డించింది.. ఈ ట్యాపింగ్ లో గ‌త పాల‌కుల ప్ర‌మేయం ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయని బిజెపి తెలిపింది.. ఈ కేసులో నిజ‌నిజాలు వెలుగులోకి రావాలంటే సిబిఐ విచార‌ణ జ‌ర‌పాల‌ని గ‌వ‌ర్న‌ర్ ను అభ్య‌ర్ధించింది.. ఈ లేఖ‌పై బిజెపి రాష్ట్ర అధ్య‌క్షుడు కిష‌న్ రెడ్డి, ఎంపి ల‌క్ష్మ‌ణ్ తో పాటు బిజెపి రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌భ్యులు సంత‌కాలు చేశారు..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement