Thursday, April 25, 2024

హుజురాబాద్ ఓటమి జీర్ణించుకులేకే దాడులు: డీకే అరుణ

హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓటమిని సీఎం కేసీఆర్ జీర్ణించుకోలేక పోతున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. నల్గొండ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటనలో చోటు చేసుకున్న పరిణామాలు, ఆయన కాన్వాయ్ పై జరిగిన దాడి పై గవర్నర్ కు బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. అనంతరం డీకే అరుణ మాట్లాడుతూ.. హుజురాబాద్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ వేల కోట్లు ఖర్చుపెట్టినా… జీవోలు తెచ్చిన ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. తెలంగాణ ప్రజల ఆలోచనలే హుజూరాబాద్ ఎన్నికల్లో ప్రతిబింబించాయని పేర్కొన్నారు. సీఎం ఆదేశాల మేరకే బండి సంజయ్ పై దాడి జరిగిందన్నారు. తెలంగాణలో శాంతిభద్రతలు క్షిణీస్తున్నాయన్న ఆమె.. ఇదే విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. దాడులు చేయడం కాదు వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలన్నారు. బెంగాల్ తరహా రాజకీయాలు ఇక్కడ చేయాలని కేసీఆర్ భావిస్తున్నారని మండిపడ్డారు. వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వానకాలం ధాన్యం కొనాలి అని డిమాండ్ చేశారు. చేశారు. కేంద్రం వానాకాలం వరిధాన్యం కొనుగోలు చేస్తామని చెబుతున్నా.. తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను తెరవడం లేదని డీకే అరుణ విమర్శించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

https://twitter.com/AndhraPrabhaApphttps://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement