Sunday, May 26, 2024

స్థానిక పేద‌ల‌కే డ‌బుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వాలి … ఎన్ వి ఎస్ ఎస్ ప్ర‌భాక‌ర్

రామంతపూర్ : డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు స్థానికులకు,అర్హులైన నిరుపేదలకు,మహిళలకు ఇవ్వాలని ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ డిమాండ్ చేశారు.ఉప్పల్ నియోజకవర్గంలోని రామంతపూర్ లో బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో ఆయన డబుల్ బెడ్ రూముల పంపిణీ కోసం 48 గంటల నిరసన ధర్నాచేప‌ట్టారు..

ఈ సందర్భంగా ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ గత తొమ్మిదిన్నార సంవత్సరాల తెలంగాణ పాలనలో ఇదిగో డబుల్ బెడ్ రూమ్ అదిగో డబుల్ బెడ్ రూమ్ అంటూ మభ్యపెడుతూ పబ్బం గడుపుకుంటూ ఓట్లు దండు కుంటున్నారు తప్పా ఏ ఒక్క నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ లు అందలేద‌ని ఆరోపించారు.. తాను ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు ఉప్పల్ నియోజకవర్గంలో కట్టిన డబుల్ బెడ్ రూమ్ లు పేద ప్రజలకు ఇవ్వకుండా వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారంటూ మండిప‌డ్డారు. .కట్టిన డబుల్ బెడ్ రూమ్ లు కూడా లంచాలు తీసుకొని స్థానికులకు ఇవ్వడం లేద‌ని ఆరోపించారు. ఈ నిరసన ధర్నా లో బీజేపీ నాయకులు ,మహిళలు భారీగా పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement