Saturday, May 4, 2024

భ‌ద్రాద్రి కొత్తగూడెం బిజెపి జిల్లా అధ్య‌క్షుడు స‌త్య‌నారాయ‌ణ సస్పెండ్ … నేడు బిఆర్ఎస్ లో చేరే అవ‌కాశం

కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారతీయ జనతా పార్టీ కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జిల్లా పార్టీ అధ్యక్షుడు డు కోనేరు సత్యనారాయణ అధికార బీఆర్‌ఎస్ పార్టీలో చేరనున్నారు. ఈ వియ‌యం తెలుసుకున్న బిజెపి భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా అధ్య‌క్షుడు కోనేరు స‌త్య‌నారాయ‌ణ‌ను పార్టీ నుంచి బ‌హిష్క‌రించింది..

కాగా స‌త్య‌నారాయ‌ణ గ‌త రాత్రి సిఎం కెసిఆర్ ను ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో క‌లిశారు.. బిఆర్ఎస్ లో చేరనున్న‌ట్లు వెల్ల‌డించారు.. దీంతో కెసిఆర్ కొనేరు చిన్నిని బీఆర్‌ఎస్‌లోకి పార్టీ అధినేత ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి చిన్న నేడు రాజీనామా చేయనున్నారు. అనంతరం బిఆర్ఎస్ లో చేరనున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement