Monday, April 29, 2024

నిర్మల్ మున్సిపల్ కార్యాలయం వద్ద బిజెపి ఆందోళన

నిర్మల్ మున్సిపల్ కార్యాలయం వద్ద బిజెపి కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. నిర్మల్ పట్టణంలోని వైఎస్ఆర్ కాలనీ చెందిన 16 సంవత్సరాల మైనర్ బాలికపై అత్యాచారం చేసిన మున్సిపల్ వైస్ చైర్మన్ ను పదవి నుండి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. బాధిత బాలికకు న్యాయం చేయాలని కోరుతూ నిర్మల్ బిజెపి ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ ని కలవడానికి వెళ్లారు. ఈ క్రమంలో బీజేపీ నాయకులపై టీఆర్ఎస్ కౌన్సిలర్లు, కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. తమపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలంటూ బీజేపీ నాయకులు నినాదాలు చేశారు. పోలీసులు రంగం ప్రవేశం చేసి ఇరు వర్గాల వారిని సర్దిచెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement