Saturday, April 27, 2024

హరిత రక్షకుడు ప్రిన్స్​ ​మహేశ్​ బాబుకు బర్త్​డే విషెష్..​ వైరలవుతున్న ఎంపీ సంతోష్​ ట్వీట్​

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు పుట్టిన‌రోజు వేడుక‌లను అభిమానులు గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేశారు. ఇవ్వాల మ‌హేశ్ బాబు బ‌ర్త్ డే సంద‌ర్భంగా సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలిపారు. రాజ్య‌స‌భ స‌భ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ హీరో మ‌హేశ్ బాబుకు బ‌ర్త్ డే విషెస్ అందించారు. ‘‘మా విలువైన హరిత రక్షకులలో ఒకరైన మ‌హేశ్ బాబుకు హార్థిక జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు.. మీరు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల సంఖ్య‌లో ఉన్న‌ సినీ అభిమానుల హృదయ స్పందనగా కొన‌సాగాలి” అంటూ ఎంపీ సంతోష్ ట్వీట్ చేశారు. ఓ ఈవెంట్ సంద‌ర్భంలో మ‌హేశ్‌తో స‌ర‌దాగా ముచ్చ‌టిస్తున్న‌పుడు తీసిన స్టిల్‌ను ఆయ‌న తన ట్వీట్​ ద్వారా ద్వారా షేర్ చేసుకున్నారు. ఇపుడీ ట్వీట్ నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది.

పుట్టిన‌రోజు పుర‌స్క‌రించుకుని అభిమానులు ఇప్ప‌టికే పోకిరి స్పెష‌ల్ షోలు వేసి త‌మ ఫేవ‌రేట్ హీరోపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. సాధార‌ణంగా స్పెష‌ల్ షోలంటే ఒక‌టో, రెండో లొకేష‌న్ల‌లో వేస్తారు. కానీ, పోకిరి మాత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా 200కు పైగా థియేట‌ర్ల‌లో స్పెష‌ల్ స్క్రీనింగ్ వేశారు. మ‌హేశ్ బాబుకు ఫ్యాన్ ఫాలోయింగ్‌, క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో ఈ ఒక్క అప్‌డేట్ చెప్పేస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement