Friday, May 3, 2024

bhupalapalli : టెన్ష‌న్ పెడుతున్న పెద్ద‌పులి

గ‌త కొన్ని రోజులుగా పెద్ద‌పులి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సంచ‌రిస్తూ..ప్ర‌జ‌ల‌ను టెన్ష‌న్ పెడుతోంది. ఎప్పుడు గ్రామాల్లోకి వ‌చ్చి పులి దాడిచేస్తుందోన‌ని ప‌రిస‌ర గ్రామాల ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న చెందుతున్నారు. ఇటీవ‌లే పశువుల మందపై పులి దాడి చేయ‌గా.. తాజాగా ఓ పెండ్లి బృందం వెళ్తున్న‌ వాహనం వెంటపడటం స్థానికంగా కలకలం రేపింది. ఇవాళ‌ జిల్లాలోని అన్నారం-కాళేశ్వరం మార్గమధ్యలో చంద్రుపల్లి ఏరియా రాంప్ (కెనాల్ )వద్ద పెద్దపులి పలువురిని భయభ్రాంతులకు గురి చేసింది. ఈ విష‌యాన్ని వారు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో పులి పాదముద్రల ఆనవాళ్లను సేకరించారు. పులి సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ పెండ్లి బృందం టాటా ఏస్ వాహనంలో వెళ్తుండగా.. చంద్రుపల్లి సమీపంలో వాహనం వెంటపడి సుమారు కిలోమీటర్ మేర తరిమినట్లు సమాచారం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement