Thursday, May 2, 2024

TS : టీఎస్ ఆర్టీసీ కుటుంబం తరపున… మ‌హిళలందరికీ శుభాకాంక్ష‌లు.. సజ్జనార్

టీఎస్ ఆర్టీసీ కుటుంబం తరపున మహిళామణులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్. ఈ మేర‌కు ట్విట్ట‌ర్‌వేదిక ఆయ‌న ట్వీట్ చేశారు.

- Advertisement -

మహిళా సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు సౌకర్య పథకానికి మహిళా లోకం బ్రహ్మరథం పడుతోంది. ప్రతి రోజు సగటున 27 లక్షల మంది అతివలు ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నారు. ఇప్పటి వరకు 24 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా రాకపోకలు సాగించారు. ఇది సంస్థకు ప్రోత్సాహకరం. తమ దైనందిన జీవితంలో ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకుంటూ.. క్షేమంగా గమ్యస్థానాలకు చేరుతున్న మహిళలకు మరొకసారి #WomensDay శుభాకాంక్షలు.’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు మహాలక్ష్మీ స్కీమ్ ప్రారంభోత్సం సందర్భంగా మహిళలతో దిగిన ఫోటోలను సజ్జనార్ జత చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement