Sunday, April 28, 2024

TS: సోనియా ఆధ్వర్యంలో బీసీలకు మోసం జరిగింది: ఎమ్మెల్సీ కవిత

సోనియాగాంధీ ఆధ్వర్యంలో బీసీలకు భయంకరమైన మోసం జరిగిందని భారత జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. బీసీల హక్కుల సాధనకై నల్లగొండలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… 1931లో భారతదేశంలో బ్రిటిష్ వారి ఆధ్వర్యంలో కుల గణన చేశారు. బీజేపీ ప్రభుత్వం వచ్చాక మాములుగా జనాభా లెక్కలు తీయలేదు అన్నారు. కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే చేయడం జరిగిందన్నారు. అనేక మంది మేధావులకు, బీసీలకు న్యాయం జరగాలన్నారు. ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు కుల గణన చేయలేదన్నారు. కులగణన పేరున 2006లో ఖర్చు పెట్టిన 4500 కోట్ల వృధా అయ్యాయన్నారు.

బీసీలు అందరూ కూడా మనమెంతో మనకంత అనే నినాదంతో ముందుకు వెళ్ళాలన్నారు. మన బీసీలు ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొని రావాలని తెలిపారు. మొదటగా పూలే విగ్రహం అసెంబ్లీలో పెట్టాలని, భారత జాగృతి ఆధ్వర్యంలో కోరుతున్నామ‌న్నారు. 48 గంటల దీక్ష చేసి అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టేలా చేశామన్నారు. పార్లమెంట్ లో పూలే విగ్రహం ఉన్నది మరి అసెంబ్లీలో ఎందుకు పెట్టారని అడిగారు. చట్టం చేసి కులగణన చేయాలన్నారు. తెలంగాణ అసెంబ్లీలో చేసిన తీర్మానం తూతూ మంత్రంగా చేశారు. కుల గణన చేసి లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్లాలన్నారు. బీసీ సబ్ ప్లాన్ చేయాలన్నారు. తొలి బడ్జెట్‌లో ఎంబీసీలకు స్థానం లేదన్నారు.

అన్ని జిల్లాల్లో బీసీలతో తాము రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామ‌న్నారు. పూలే జయంతికి ఇంకా ఒక నెల మాత్రమే మిగిలి ఉందన్నారు. ఉద్యమ కార్యాచరణతో ముందుకు వెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ పూలే ఫ్రంట్ నాయకులు జూలూరి గౌరీశంకర్, నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్, షీప్, గోట్స్ కమిషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాల్ రాజ్ యాదవ్, రాజారామ్ యాదవ్, గట్టు రాం చందర్ రావు అలాగే నల్లగొండకు చెందిన బీసీ సంఘాల నాయకులు బోనగిరి దేవేందర్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement