Thursday, May 2, 2024

HYD: బండ్లగూడ జాగీర్‌ గణేష్ లడ్డూ @ రూ.1.26 కోట్లు

హైదరాబాద్‌ నగరంలో గణేష్ నిమజ్జనం వైభవంగా కొనసాగుతుంది. గణేశ్‌ ఉత్సవాల్లో చివరి రోజైన నిమజ్జనం రోజు లడ్డూ వేలం పాటలు పోటాపోటీగా సాగుతున్నాయి. ఇందుకోసం ఎంతైనా వెచ్చించడానికి వెనకాడటం లేదు. మరోవైపు గణనాథుడి లడ్డూల వేలం ప్రక్రియ కూడా జోరుగా సాగుతుంది. ఆది దేవుడైన గణపతి ప్రసాదాన్ని సొంతం చేసుకోవడానికి భక్తులు పోటీపడుతున్నారు.

హైదరాబాద్‌లోని బండ్లగూడ జాగీర్‌లో లంబోదరుడి చేతిలోని లడ్డూ రికార్డు ధర పలికింది. కీర్తి రిచ్మండ్‌ విల్లాస్‌లో జరిగిన వేలంలో వినాయకుడి లడ్డూ ఏకంగా రూ.1.26 కోట్లు పలికింది. విల్లాలోని కమ్యూనిటీ మొత్తం కలిసి ఆ లడ్డూను సొంతం చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement