Friday, May 10, 2024

సీఎం కేసీఆర్ కు బండి సంజ‌య్ బ‌హిరంగ‌ లేఖ

బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ సీఎం కేసీఆర్‌ కు బహిరంగ లేఖ రాశారు. ప్రజా సంగ్రామ యాత్ర రెండవ విడత పాదయాత్రలో అనేక మంది రైతులు త‌న‌ను కలిసి అర్జీలు ఇచ్చారని, గత ఏడు రోజులుగా ఏ గ్రామానికి వెళ్ళినా వందలాది మంది రైతులు త‌నవద్దకు వచ్చి రైతు రుణమాఫీ జరుగలేదని తమ గోడు వెళ్ళబోసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రైతు రుణమాఫీ జాప్యం, రాష్ట్రంలో ఉన్న 14 లక్షల మంది కౌలు రైతులకు ఎటువంటి రక్షణ లేకపోవడంపై వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం నుండి రైతాంగం పొందే ఎటువంటి లబ్ది కూడా కౌలు రైతులకు అందకపోవడం విచారకరమని ఫైర్అయ్యారు. బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను మీ దృష్టికి తీసుకువ‌స్తున్నాన‌ని పేర్కొన్నారు. 2018 ఎన్నికల సమయంలో లక్ష రూపాయల వరకు రైతులకు వున్న కూడా బకాయిలను రద్దు చేస్తామని టీఆర్‌ఎస్‌ హామీ ఇచ్చిందన్నారు. ఈ నాలుగేండ్ల కాలంలో 20,164.20 కోట్లు కేటాయించినట్లు గొప్పలు చెప్పినా అందులో ప్రభుత్వం విడుదల చేసింది కేవలం 1,144.38 కోట్లు మాత్రమేన‌ని లేఖ‌లో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement